భారతీయులకు గుడ్‌న్యూస్: వీసాలను వేగంగా జారీ చేసేందుకు సిబ్బంది నియామకాలు రెట్టింపు చేస్తున్న అమెరికా
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయులకు వీసాలను ఎక్కువ సంఖ్యలో, వేగంగా జారీ చేసేందుకు అమెరికా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం దౌత్య కార్యాలయాల్లో నియామకాలను రెట్టింపు చేయాలని భావిస్తోంది. అది కూడా భార్య భర్తలను నియమించాలని అమెరికా కృషి చేస్తోందని ఆ దేశ అధికారులు చెబుతున్నారు.
కరోనా సమయంలో చాలామంది వృత్తి నిపుణులు, విద్యార్థులను అమెరికా.. భారత్‌కు పంపింది. దౌత్య కార్యాలయంలోని సిబ్బందిని కూడా భారత్ నుంచి అమెరికాకు రప్పించింది. దీంతో దౌత్య కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఎక్కువైంది. కరోనా తగ్గిన తర్వాత వీసాల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి.
ఈనేపథ్యంలో వీసాల జారీ ఆలస్యం అవుతోంది. వీసాల కోసం నెలలు కాదు సంవత్సరాలుగా వేచిచూస్తున్నారు. ఈక్రమంలో ఫిర్యాదులు అందడంతో స్పందించిన అధికారులు తాజా వ్యాఖ్యలు చేశారు.
వీసా
స్టూడెంట్ వీసాల జారీలో పురోగతి సాధించాం: అమెరికా
2019 ముందు కంటే 2022లో అమెరికా ఎక్కువ హెచ్1బీ, ఎల్ వీసాలను జారీ చేసిందని గ్లోబల్ మార్కెట్ల యూఎస్ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ కామర్స్ అరుణ్ వెంకటరమణ్ అన్నారు. స్టూడెంట్ వీసాల జారీలో పురోగతి సాధించామని, సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికేందుకు అమెరికా రాయబార కార్యాలయం చర్యలు కొనసాగిస్తోందని వెంకటరామణ్ వెల్లడించారు.
అమెరికా వెళ్లాలనుకునే భారతీయులు వీసా అపాయింట్‌మెంట్ కోసం కనీసం రెండు నుంచి మూడేళ్లపాటు వేచి చూడాల్సి వస్తోందని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్‌కు ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వివరించారు. అయితే ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన కూడా హామీ ఇచ్చారు.