ఉక్రెయిన్‌కు షాకిచ్చిన అమెరికా, ఎఫ్-16 యుద్ధ విమానాలను పంపట్లేదని బైడెన్ ప్రకటన
ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ క్రమంలో రష్యా సేనలను ధీటుగా ఎదుర్కోవడానికి, ఉక్రెయిన్ సైనిక శక్తిని బలోపేతం చేయడానికి ఆధునిక ట్యాంకులు, యుద్ధ విమానాలను సాయం చేయాలని మిత్ర దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు. తాజాగా ఉక్రెయిన్ కోరిన సాయంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. ఉక్రెయిన్ కోరిన ఎఫ్-16 యుద్ధ విమానాలను అమెరికా అందించబోదని బైడెన్ స్పష్టం చేశారు. తూర్పు ప్రాంతంలో కనికరం లేకుండా రష్యా చేస్తున్న దాడులను ఉక్రెయిన్ సైన్యం తిప్పికొడుతున్నఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటన చేసిన కొద్ది సేపటికే బైడెన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
అమెరికా, జర్మనీ నుంచి ఉక్రెయిన్‌కు యుద్ద ట్యాంకుల సపోర్ట్ మాత్రమే
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభ్యర్థన మేరకు యుద్ధ ట్యాంకులను మాత్రమే పంపడానికి అమెరికా సిద్ధంగా ఉన్నట్లు యూఎస్ అధికారులు రాయిటర్స్‌తో ఇది వరకే చెప్పారు. 'ఎం1 అబ్రమ్స్' శ్రేణికి చెందిన 30 యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్‌కు పంపేందుకు అమెరికా సిద్ధమవుతోంది. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ కూడా ఉక్రెయిన్‌కు ఒక కంపెనీ లియోపార్డ్ 2 ఏ6 యుద్ధ ట్యాంకులను పంపాలని పంపాలని ఇప్పటికే నిర్ణయించింది. ఒక కంపెనీలో 14 యుద్ధ ట్యాంకులు ఉంటాయి. యుద్ధ విమానాలను పంపించబోమని ఇప్పటికే జర్మనీ క్లారిటీ ఇవ్వగా, తాజాగా అమెరికా కూడా స్పష్టం చేసింది. ఈ క్రమంలో అమెరికా, జర్మనీ నుంచి యుద్ద ట్యాంకుల సపోర్ట్ మాత్రమే ఉక్రెయిన్‌కు అందనుంది.