Page Loader
నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపనున్న స్పేస్‌ఎక్స్
ఫిబ్రవరి 27న 1:45 am EST (12:15 pm IST)కి ప్రయోగం

నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపనున్న స్పేస్‌ఎక్స్

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 27, 2023
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎలోన్ మస్క్ సంస్థ స్పేస్‌ఎక్స్ సోమవారం నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపనుంది. నాసా వ్యోమగాములు స్టీఫెన్ బోవెన్, వారెన్ హోబర్గ్, UAE వ్యోమగామి సుల్తాన్ అల్నేయాడి, రష్యన్ అంతరిక్ష సంస్థ, రోస్కోస్మోస్, కాస్మోనాట్ ఆండ్రీ ఫెడ్యావ్‌లతో కలిసి ఆరు నెలల పాటు శాస్త్రీయ పరిశోధన కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్నారు. నలుగురు వ్యోమగాములతో ఉన్న క్రూ-6 మిషన్ ను ఫ్లోరిడాలోని కెన్నెడీ లాంచ్ కాంప్లెక్స్ 39A నుండి ప్రయోగిస్తారు. నలుగురు సభ్యుల సిబ్బంది కలిసి సున్నా గురుత్వాకర్షణలో స్పేస్ స్టేషన్‌ ట్రాన్సిట్ లో ఒక రోజు గడుపుతారు. ఈ 6 నెలలలో మానవ శరీరాన్ని భవిష్యత్ అంతరిక్ష ప్రయాణానికి అనుకూలంగా చేయగల సాంకేతిక పరిణామాలపై ప్రయోగాలు చేస్తారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అంతరిక్ష ప్రయాణానికి సిద్దమైన వ్యోమగాములు