Page Loader
Spotify కొత్త AI DJ సంగీతాన్ని సృష్టించగలదు, కామెంటరీ అందించగలదు
Spotify కొత్త AI DJ సంగీతాన్ని సృష్టించగలదు

Spotify కొత్త AI DJ సంగీతాన్ని సృష్టించగలదు, కామెంటరీ అందించగలదు

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 24, 2023
01:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

Spotify అత్యుత్తమ ఆడియో నాణ్యతతో సంగీతాన్ని అందించకపోవచ్చు, కానీ సరైన సమయంలో సరైన సంగీతాన్ని అందించడంలో ముందుంటుంది. ఈ ఆడియో స్ట్రీమింగ్ వేదిక ఇప్పుడు తన కొత్త AIతో పనిచేసే DJతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ChatGPT విజయవంతమైన తర్వాత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు జనాదరణ విపరీతంగా పెరుగుతుండటంతో, టెక్ కంపెనీలు AI-ఆధారిత ప్రోడక్ట్ తో వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. OpenAI జూక్‌బాక్స్ నుండి రాయల్టీ రహిత సంగీతాన్ని సృష్టించగల Beatovan.ai వరకు ఇటువంటి ఉత్పత్తులు కొత్తేమి కాదు. ఇప్పుడు, Spotify కూడా ఆ లిస్ట్ లో చేరింది. Spotify కొత్త AI DJని పాకెట్ DJ అంటున్నారు. Spotify DJ రేడియో DJలాగా ఉంటుంది .

ఆడియో

Spotify గత సంవత్సరం Sonantic ని కొనుగోలు చేసింది

ఈ AI DJ కళాకారుడు లేదా ట్రాక్ గురించి AI-ఆధారిత కామెంటరీతో పాటుగా సృష్టించిన సంగీతాన్ని అందిస్తుంది Spotify AI DJ అనేది కంపెనీ రూపొందించిన టెక్నాలజీ, OpenAI టెక్నాలజీతో పాటు Sonantic AI నుండి వాయిస్ టెక్ ప్రోడక్ట్. Spotify గత సంవత్సరం చాలా ఖచ్చితమైన ఆడియో డీప్‌ఫేక్‌లను సృష్టించగల Sonantic ని కొనుగోలు చేసింది. ప్రస్తుతం DJకి ఒకే ఒక్క వాయిస్ ఉంది. దీని అర్థం భవిష్యత్తులో మరిన్ని ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది అని.Spotify AI DJ బీటా వెర్షన్‌ను విడుదల చేసింది. US, కెనడాలోని Spotify ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లు మాత్రమే ప్రస్తుతం ఇది అందుబాటులో ఉంది.