Page Loader
300మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో ఆయిల్ లీక్; అత్యవసర ల్యాండింగ్
300మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో ఆయిల్ లీక్

300మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో ఆయిల్ లీక్; అత్యవసర ల్యాండింగ్

వ్రాసిన వారు Stalin
Feb 22, 2023
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని నెవార్క్ విమానాశ్రయం నుంచి దిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా AI106 విమానంలో బుధవారం సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అలర్ట్ అయిన పైలెట్, స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలోని ఇంజిన్‌లో ఆయిల్ లీక్ కావడం వల్లే సాంకేతిక సమస్య తలెత్తినట్లు అధికారులు చెప్పారు. పైలెట్ అప్రమత్తతో విమానంలోని ప్రయాణికులు అంతా క్షేమంగా ఉన్నారు. విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసే సమయంలో ఎలాంటి అవాంఛనీయం సంఘటనలు జరగకుండా పెద్ద సంఖ్యలో అగ్నిమాపక యంత్రాలు విమానాశ్రయంలో మోహరించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

ఎయిర్ ఇండియా

గ్రౌండ్ ఇన్‌స్పెక్షన్ సమయంలో ఆయిల్ లీక్

ఆయిల్‌ లీక్‌ కారణంగా ఇంజిన్‌ షట్‌‌డౌన్‌ అయిందని, ఆ తర్వాత విమానాన్ని స్టాక్‌హోమ్‌లో సురక్షితంగా ల్యాండ్‌ చేసినట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) సీనియర్‌ అధికారి తెలిపారు. గ్రౌండ్ ఇన్‌స్పెక్షన్ సమయంలో ఇంజిన్‌ను చెక్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఆ సమయంలోనే ఆయిల్ బయటికి రావడం కనిపించినట్లు తమ విచారణలో తేలిందని చెప్పారు. ఇదిలా ఉంటే, సోమవారం తెల్లవారుజామున న్యూయార్క్ నుంచి దిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా లండన్‌కు మళ్లించారు.