ఎయిర్ ఇండియాను మించిపోయిన ఇండిగో ఎయిర్‌లైన్స్, ఏకంగా 500 విమానాలకు ఆర్డర్
ఎయిర్ ఇండియా 470 విమానాలకు అర్డర్ ఇస్తేనే ప్రపంచదేశాలు ఆశ్చర్యపోయాయి. ఇప్పుడు దానికి మించిన విమానాల ఆర్డర్‌ను ప్రముఖ ఎయిర్ లైన్స్ ఇండిగో ఇవ్వడంతో ప్రపంచమంతా భారత్‌లో ఏం జరుగుతుందని గమనిస్తున్నారు. 500 విమానాలను కొనుగోలు ఎయిర్‌బస్‌తో చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ఇండిగో అంతర్జాతీయ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా చెప్పారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు కనెక్టవిటీని పెంచేదుకు ఈ విమానాలను కొగుగోలు చేయనున్నట్లు మల్హోత్రా పేర్కొన్నారు. ముఖ్యంగా ఐరోపా ఖండంలోని దాదాపు 27గమ్యస్థానాలకు రాకపోకలు సాగించేందుకు ఈ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు వినయ్ మల్హోత్రా పేర్కొన్నారు.
ప్రస్తుతం 1800విమానాలు ఉండగా 10శాతంమాత్రమే అంతర్జాతీయ మార్గాల్లో..
ఇండిగో ఎయిర్‌లైన్స్ తన సేవలను టర్కీతో పాటు యూరోపియన్ గమ్యస్థానాలతో సహా అంతర్జాతీయ మార్గాలకు వెళ్లేందుకు ఇప్పటికే ఒక ప్రణాళికను ప్రకటించింది. ప్రస్తుతం ఇండిగో వద్ద 1800విమానాలు ఉండగా, అందులో 10శాతంమాత్రమే అంతర్జాతీయ మార్గాల్లో నడుస్తున్నాయి. యూరప్‌లోని యూకే, ఫ్రాన్స్, ఇటలీ, ఐర్లాండ్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌తో సహా ఇతర దేశాల మార్లాల్లో నడిపేందుకు కొత్తగా కోనుగోలు చేసేవి ఉపయోగపడుతాయని వినయ్ మల్హోత్రా వెల్లడించారు. అయితే టర్కిష్ ఎయిర్‌లైన్స్ కోడ్‌షేర్‌తో ఇండిగో యాజమాన్యం భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకున్నట్లు పేర్కొన్నారు. కోడ్‌షేర్‌గా మా భాగస్వామ్యంతో భారతదేశం నుంచి ఇస్తాంబుల్‌కు, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణీకులను తీసుకెళ్తున్నట్లు ప్రకటించారు. సమీప భవిష్యత్‌లో నైరోబీ, జకార్తా అనే రెండు కొత్త పాయింట్లను ప్రారంభించనున్నట్లు మల్హోత్రా ప్రకటించారు.