Page Loader
తగ్గేదేలే అంటున్న 'ఎయిర్ ఇండియా'; ఏకంగా 840 విమానాల కోనుగోలుకు 'టాటా' ప్లాన్
మరో 370 విమానాలను కొనుగోలు చేసే ఆలోచనలో ఎయిర్ ఇండియా

తగ్గేదేలే అంటున్న 'ఎయిర్ ఇండియా'; ఏకంగా 840 విమానాల కోనుగోలుకు 'టాటా' ప్లాన్

వ్రాసిన వారు Stalin
Feb 16, 2023
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా విమానాల కొనుగోళ్లలో ప్రపంచదేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే రూ.6లక్షల కోట్ల విలువ చేసే 470 విమానాలను బోయింగ్, ఎయిర్‌బస్‌ కంపెనీలకు ఆర్డర్‌ చేసి ప్రపంచంలోనే అతిపెద్ద డీల్‌ను ఎయిర్ ఇండియా కుదుర్చుకుంది. తాజాగా మరో 370 విమానాలను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫీసర్ నిపున్ అగర్వాల్ ప్రకటించారు. దీంతో విమానయాన రంగంలోనే ఎవరూ ఊహించని డీల్‌కు ఆ సంస్థ తెరలేపింది. ఇప్పటికే ఎయిర్‌బస్ నుంచి 250, బోయింగ్ నుంచి 220 విమానాలకు ఆర్డర్ చేసింది. నిపున్ ఆగర్వాల్ చెప్పినట్లు 370 విమానాలను ఆర్డర్ చేస్తే ఆ సంఖ్య 840కి చేరుకుటుంది.

ఎయిర్ ఇండియా

అమెరికా ఎయిర్ లైన్స్ రికార్డును తిరగరాసిన ఎయిర్ ఇండియా

ఎయిర్ ఇండియా ఆర్డర్ చేసిన విమానాల సంఖ్య 840కి చేరుకుంటే ప్రపంచంలోనే ఏకకాలంకో ఇంతపెద్ద డీల్ భవిష్యత్‌లో జరిగే అవకాశం ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏకకాలంలో అత్యధిక విమానాలు ఆర్డర్ ఇచ్చిన సంస్థగా ఇప్పటికే ఎయిర్ ఇండియా రికార్డు నెలకొల్పింది. 470విమానాలను ఇప్పటి వరకు ఏ ఎయిర్ లైన్స్ కూడా ఆర్డర్ ఇవ్వలేదు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ 2011లో 460 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. మొన్నటి వరకు ఇదే మొదటి స్థానంలో ఉండేది. 470 విమానాలతో ఇప్పుడు ఆ స్థానాన్ని ఎయిర్ ఇండియా భర్తీ చేసింది. భారత్‌లో చూసుకుంటే 2019లో ఇండిగో ఎయిర్‌లైన్స్ 300-ఎయిర్‌క్రాఫ్ట్స్‌ను ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు ఆ రికార్డును ఎయిర్‌ఇండియా చెరిపేసింది.