2000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైన దిగ్గజ కంపెనీ 'మెకిన్సీ'
మరో అంతర్జాతీయ సంస్థ తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. దిగ్గజ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే & కో తన కంపెనీలోని దాదాపు 2,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ తొలగింపు జాబితాలో క్లయింట్లతో ప్రత్యేక్షంగా సంబంధం లేని వారు మాత్రమే ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. గత పదేళ్లలో సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరిగినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. సిబ్బంది పునర్వవ్యవస్థీకరణలో భాగంగానే తాజా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే తమ సంస్థలో ఉద్యోగలు రిక్రూటమెంట్ ప్రాసెస్ అనేది యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు.
మెకిన్సీలో ప్రస్తుతం 45,000 మంది ఉద్యోగులు
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, మెకిన్సీలో ప్రస్తుతం 45,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే తాజాగా 2000 మందిని తొలగించనున్నట్లు చెబుతున్నా, ఇంకా సంఖ్య ఖరారు కాలేదని తెలుస్తోంది. తొలగించే వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం. 2012లో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 17,000 మంది ఉండగా, అది 2017లో ఆ సంఖ్య 28,000కు చెరినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక చెబుతోంది. సంస్థ 2021లో రికార్డు స్థాయిలో 15 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. 2022లో ఆ సంఖ్యను అధిగమించింది.