అమెరికా: మిస్సిస్సిప్పిలో తుపాకీ గర్జన; ఆరుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. మిస్సిస్సిప్పిలోని టేట్ కౌంటీలో శుక్రవారం వరుస కాల్పుల నేపథ్యంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులన్ని అర్కబుట్ల కమ్యూనిటీలోనే జరిగినట్లు వెల్లడించారు.
తొలుత అర్కబుట్ల రోడ్‌లోని దుకాణంలో కాల్పులకు బలైన ఒక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత అర్కబుట్ల డ్యాం రోడ్డులోని ఓ ఇంట్లో మహిళ కూడా మృతి చెందినట్లు తెలుసుకున్నారు. ఈ సంఘటనలో ఆమె భర్త గాయపడ్డాడు. అతను కాల్పుల వల్ల గాయపడ్డాడా కాల్చబడ్డాడా అనేది తెలియాల్సి ఉంది.
అర్కబుట్ల డ్యామ్ రోడ్‌లో వాహనంలో వెళ్తున్నట్లు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అమెరికా
మిస్సిస్సిప్పి బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు
నిందితుడి అరెస్టు తర్వాత, స్థానికులు మరో నాలుగు మృతదేహాలను గుర్తించారు. ఆర్కబుట్ల ఆనకట్ట రోడ్డులో ఇద్దరు ఇంటి లోపల, ఇద్దరు బయట చనిపోయారు.
మిస్సిస్సిప్పి గవర్నర్ టేట్ రీవ్స్ కాల్పులకు గురించి వివరిస్తూ, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ట్వీట్ చేశారు. అయితే అతను ఎందుకు కాల్పులు జరిపాడనేది తెలియరాలేదని చెప్పుకొచ్చారు. మిస్సిస్సిప్పి బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తోంది.
సాధారణంగా అమెరికాలో వీకెండ్ పార్టీల్లో కాల్పులు జరుగుతుంటాయి. అయితే నివాసాల మధ్య కాల్పులకు తెగబడటంపై యంత్రాంగం సీరియస్‌గా స్పందిస్తోంది.