
Raj Bhavan: 'టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించలేదు'
ఈ వార్తాకథనం ఏంటి
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి తన పదవికి సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
అయితే జనార్దన్‌రెడ్డి రాజీనామా విషయంలో రాజ్‌భవన్ ట్విస్ట్ ఇచ్చింది. బి.జనార్దన్‌రెడ్డి చేసిన రాజీనామాను గవర్నర్ తమిళిసై ఇంకా ఆమోదించలేదని రాజ్‌భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌రెడ్డి రాజీనామా చేసిన వెంటనే.. గవర్నర్ ఆమోదించినట్లు ప్రచారం జరిగింది.
అయితే ఈ ప్రచారంపై రాజ్‌భవన్ క్లారిటీ ఇచ్చింది. జనార్దన్‌రెడ్డి రాజీనామా ఆమోదించినట్లు వస్తున్న వార్తలు అవాస్తమని రాజ్ భవన్ పేర్కొంది.
జనార్దన్‌రెడ్డి సోమవారం సాయంత్రం రేవంత్‌రెడ్డిని కలిశారు. అనంతరం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారు.
ప్రస్తుతం గవర్నర్ తమిళసై పుదుచ్చేరి పర్యటనలో ఉన్నారు. జనార్దన్‌రెడ్డి రాజీనామాను పరిశీలించాక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రకటన విడుదల చేసిన రాజ్ భవన్
టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించలేదు. రాజీనామా ఆమోదించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. pic.twitter.com/pE2NbXH6N0
— ETVTelangana (@etvtelangana) December 12, 2023