Patnam Mahender reddy: మంత్రిగా ప్రమాణం చేసిన పట్నం మహేందర్ రెడ్డి
తెలంగాణ మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ కేబినెట్ విస్తరణ చేపట్టారు. ఈ మేరకు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆయనతో పదవీ స్వీకారోత్సవం చేయించారు. 2014నుంచి 2018వరకు పట్నం రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. 2018లో తాండూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి గెలుపొందారు. అనంతరం రోహిత్ బీఆర్ఎస్‌లో చేరారు. 2019లో స్థానిక సంస్థల కోటాలో పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు. బీఆర్ఎస్ తాజాగా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో పట్నం పేరు లేదు. తాండూరులో తిరిగి పైలెట్ రోహిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో.. మహేందర్‌రెడ్డిని సంతృప్తిపర్చేందుకు కేసీఆర్ మంత్రిపదవిని కట్టబెట్టారు.