Page Loader
Andhrapradesh: చంద్రబాబు నాయుడును ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ 
చంద్రబాబు నాయుడును ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్

Andhrapradesh: చంద్రబాబు నాయుడును ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2024
03:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ను కలిసి రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కూటమి ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందజేశారు. తెలుగుదేశం పార్టీ (టిడిపి) రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు డి. పురందేశ్వరి, జనసేన పార్టీ (జెఎస్‌పి) రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ ఎన్. మనోహర్ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. ఎన్డీయేలో నూతనంగా ఎన్నికైన శాసనసభ్యుల సమావేశంలో చంద్రబాబు నాయుడును తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ ఆమోదించిన తీర్మానం కాపీని వారు ఆయనకు అందజేశారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును గవర్నర్ ఆహ్వానించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 గవర్నర్ ని కలిసిన అచ్చెన్నాయుడు, పురందేశ్వరి, నాదెండ్ల మనోహర్