
తెలంగాణ: టీఎస్‌ఆర్‌టీసీ బిల్లుకు గవర్నర్ తమిళసై ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
గవర్నర్ సమ్మతించడంతో అసెంబ్లీలో టీఎస్‌ఆర్‌టీసీ బిల్లును ఆమోదించేందుకు ప్రభుత్వానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో ఆర్టీసీ కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆదివారం ముగిస్తున్న నేపథ్యంలో గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలిపారు.
దీంతో బిల్లును ఈ రోజే అసెంబ్లీలో ఆమోదించే అవకాశం ఉంది.
ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలపడానికి ముందు గవర్నర్ తమిళిసై ఉదయం ఆర్టీసీ ఆధికారులు, కార్మిక నాయకులతో సమావేశమయ్యారు. వారితో చర్చించాక బిల్లు ఆమోదానికి సమ్మతించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టీఎస్ ఆర్టీసీ బిల్లుపై వీడిన సందిగ్ధత
LIVE : TSRTC బిల్లుకు గవర్నర్ ఆమోదం..! | Governor Tamilisai Approves TSRTC Merger Bill - TV9
— TV9 Telugu (@TV9Telugu) August 6, 2023
Watch : https://t.co/vC0rJoYJQr
#GovernorTamilisai #tsrtcbill #TSRTCMergerBill