తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: సంక్షేమంలో రాష్ట్రం భేష్: గవర్నర్ తమిళసై
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రాంరభమయ్యాయి. తొలిరోజు గవర్నర్ తమిళసై ప్రసంగంతో సభ మొదలైంది. ఎలాంటి సంచలనాలకు తావు లేకుండా గవర్నర్ ప్రసంగం ముగియడం గమనార్హం. గవర్నర్ తమిళసై తన ప్రసంగంలో తెలంగాణ ప్రభుత్వం ప్రగతిని వివరించారు. సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే ముందుందని గవర్నర్ పేర్కొన్నారు. వ్యవసాయంలో గణనీయమైన ప్రగతిని తెలంగాణ సాధించినట్లు ఆమె చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించినట్లు గవర్నర్ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అములు చేస్తున్న రైతు బంధు పథం ప్రంపచం దృష్టి ఆకర్శిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు 24గంటలు విద్యుత్‌ను అందించడంలో ప్రభుత్వం సఫళీకృతమైనట్లు ఆమె వెల్లడించారు. దళిత బంధు విప్లవాత్మకమైన పథకమని, ఇందులో భాగంగా ప్రతి దళితుడికి రూ.10లక్షల చొప్పున అందిస్తున్నట్లు చెప్పారు.
పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిన తెలంగాణ: గవర్నర్
పారిశ్రామికంగా తెలంగాణ విశేష అభివృద్ధిని సాధిస్తున్నట్లు గవర్నర్ తమిళసై పేర్కొన్నారు. పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందన్నారు. అగ్రశ్రేణి కంపెనీలు, బహుళజాతి కంపెనీలను ఆకర్షిస్తోందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు పచ్చదనాన్ని పెంపొందించడంలోనూ రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందుతోందని కితాబిచ్చారు. పేదలకు చేయూతగా ఆసరా పథకాలన్ని తీసుకొచ్చినట్లు వివరించారు. అంతేకాతు ఆసరా పథకం లబ్ధిదారుడి వయసు 57కు తగ్గించినట్లు ఆమె వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్లు పెంచినట్లు గుర్తు చేశారు. అంతేకాకుండా రూ.11వేల కోట్లతో 7.3లక్షల యూనిట్ల గొర్రెలను పంపిణీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. తద్వారా తెలంగాణ మాంసం ఉత్పత్తిలో దేశంలోనే 5వ స్థానంలో నిలిచినట్లు స్పష్టం చేశారు.