
మహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా కెప్టెన్ అమరీందర్ సింగ్ నియామకం!
ఈ వార్తాకథనం ఏంటి
బీజేపీ నాయకుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా నియామకమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొలుత సుమిత్రా మహాజన్‌ను తదుపరి గవర్నర్‌గా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సుమిత్రకు బదులుగా అమరీందర్ నియామకానికే కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
2021వరకు అమరీందర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అనూహ్యాంగా అధిష్టానం అమరీందర్ సింగ్‌ను సీఎం పదవినుంచి తప్పించింది. మనస్థాపానికి గురైన అమరీందర్ కాంగ్రెస్‌ను వీడారు. 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 'పంజాబ్ లోక్ కాంగ్రెస్' పార్టీని అమరీందర్ స్థాపించారు. గతేడాది సెప్టెంబర్‌లో తన పార్టీని బీజేపీలో విలీనం చేయగా, జాతీయ కార్యవర్గ సభ్యునిగా సింగ్‌ను పార్టీ నియమించింది.
మహారాష్ట్ర
గవర్నర్ పదవినుంచి వైదొలగడానికి కోష్యారీ వివాదాస్పద వ్యాఖ్యలే కారణమా?
తాను త్వరలోనే గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీ తెలియజేసిన నేపథ్యంలో కొత్త గవర్నర్ ఎంపిక అనివార్యమైంది.
గవర్నర్‌గా కోష్యారీ అనేక వివాదాల్లో చిక్కకున్నారు. ఇటీవల ఛత్రపతి శివాజీ మహరాజ్‌పై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలే కోష్యారీ పదవినుంచి వైదొలగడానికి కారణంగా తెలుస్తోంది.
శివాజీ పాతతరం నాయకుడని కోష్యారీ అనడం రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. గవర్నర్‌గా కొశ్యారీని రీకాల్ చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
అంతేకాకుండా గుజరాతీలు, రాజస్థానీలు వెళ్లిపోతే ముంబయికి రెవెన్యూ ఉండదని కోష్యారీ అన్న మాటలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఉద్ధవ్ థాకరే, కోష్యారీకి కొల్హాపురి చెప్పులను చూపించాలని పిలుపునిచ్చారు.