NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Cyclone Dana: ఒడిశా వద్ద తీరం దాటిన దానా తుఫాన్.. తీరప్రాంత జిల్లాలో భారీ వర్షాలు..
    తదుపరి వార్తా కథనం
    Cyclone Dana: ఒడిశా వద్ద తీరం దాటిన దానా తుఫాన్.. తీరప్రాంత జిల్లాలో భారీ వర్షాలు..
    ఒడిశా వద్ద తీరం దాటిన దానా తుఫాన్.. తీరప్రాంత జిల్లాలో భారీ వర్షాలు..

    Cyclone Dana: ఒడిశా వద్ద తీరం దాటిన దానా తుఫాన్.. తీరప్రాంత జిల్లాలో భారీ వర్షాలు..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 25, 2024
    08:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దానా తుఫాన్ ఒడిశా తీరాన్ని దాటింది. అర్ధరాత్రి 1:30 నుంచి 3:30 మధ్య సమయానికి తుఫాన్ తీరం తాకినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

    భితార్కానికా నేషనల్ పార్క్, ధమ్రా ప్రాంతాల మధ్య తీరాన్ని తుఫాన్ తాకినట్లు అధికారికంగా ప్రకటించారు.

    తీరం దాటే సమయంలో గాలులు గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడ్డాయి. ఈ ప్రభావంతో ఒడిశా తీరప్రాంతాలు తీవ్రంగా అల్లకల్లోలమయ్యాయి.

    ఇక, ఉత్తరాంధ్రలోని పోర్టులకు ఐఎండీ అధికారులు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారుల సూచనలున్నాయి.

    వివరాలు 

    నిలిపేసిన విమాన సేవలు

    భద్రక్‌, జగత్సింగ్‌పూర్‌, బాలాసోర్‌ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి.

    అధికారులు ఒడిశాలో 7 వేల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే సుమారు ఆరు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

    తుఫాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్-ఒడిశా మధ్య 400కి పైగా రైళ్లు రద్దయ్యాయి.

    అంతేకాకుండా, కోల్‌కతా, భువనేశ్వర్‌ విమానాశ్రయాల్లో విమాన సేవలు గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు నిలిపివేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తుపాను
    ఒడిశా
    పశ్చిమ బెంగాల్

    తాజా

    Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు టాలీవుడ్
    UK Professor: 'భారత వ్యతిరేక కార్యకలాపాల' కారణంగా విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా..  లండన్
    M R Srinivasan: ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎం ఆర్ శ్రీనివాసన్ కన్నుమూత  శాస్త్రవేత్త
    BCCI: లక్నో బౌలర్‌ను సస్పెండ్ చేసిన బీసీసీఐ లక్నో సూపర్‌జెయింట్స్

    తుపాను

    బిపోర్‌జాయ్ తుపాను ఎఫెక్ట్: గుజరాత్ తీరంలో రెడ్ అలర్ట్ జారీ  గుజరాత్
    అంతరిక్ష కేంద్రం నుంచి బిపోర్‌జాయ్ తుపాను చిత్రాలను బంధించిన వ్యోమగామి  అంతరిక్షం
    నెల రోజుల క్రితం పుట్టిన చిన్నారికి 'బిపోర్‌జాయ్' తుపాను పేరు  గుజరాత్
    బిపార్‌జాయ్ తుపాను బీభత్సం: గుజరాత్‌లో ఇద్దరు మృతి; 22 మందికి గాయాలు గుజరాత్

    ఒడిశా

    Snake Bit : ఈ ప్రభుద్ధుడు మనిషే కాదు.. డబ్బు కోసం భార్య,బిడ్డలను పాముకాటుతో చంపాడు భారతదేశం
    VK Pandian: ఒడిశా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యిన వీకే పాండియన్‌ భారతదేశం
    IT Raids : జార్ఖండ్, ఒడిశాలో కాంగ్రెస్ ఎంపీ నివాసంలో సోదాలు.. రూ.100కోట్లకుపైగా నగదు సీజ్  భారతదేశం
    Dheeraj Sahu IT raids: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో నల్లధనం కొండ.. నాలుగు రోజులైనా తేలని లెక్క  ఆదాయపు పన్నుశాఖ/ఐటీ

    పశ్చిమ బెంగాల్

    TV Anchor -Live-Unconcious-Lopa Mudra:లైవ్‌లో సొమ్మసిల్లి పడిపోయిన టీవీ యాంకర్‌ సినిమా
    Teachers jobs-Calcutta High court: అక్రమంగా ఉద్యోగాలు పొందారు..డబ్బులు తిరిగి చెల్లించండి: కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు ఉద్యోగులు
    Helicopter-Mamatha Benarji: హెలికాప్టర్ లో కాలుజారి ముందుకు పడిన మమతా బెనర్జీ...స్వల్పగాయాలతో బయటపడ్డ దీదీ మమతా బెనర్జీ
    West Bengal-Jp Nadda-Sandesh kali: పశ్చిమ బెంగాల్లో అరాచకం కొనసాగుతోంది...బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025