Page Loader
Changur Baba: తప్పుడు ప్రచారమే.. నేను నిర్దోషినే.. అంటున్న ఛంగూర్ బాబా
తప్పుడు ప్రచారమే.. నేను నిర్దోషినే.. అంటున్న ఛంగూర్ బాబా

Changur Baba: తప్పుడు ప్రచారమే.. నేను నిర్దోషినే.. అంటున్న ఛంగూర్ బాబా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 16, 2025
05:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా భారీ మతమార్పిడి నెట్‌వర్క్‌కు సూత్రధారిగా భావిస్తున్న జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా పై ఆరోపణలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. హిందూ యువతులు, మహిళలను లక్ష్యంగా చేసుకొని మతమార్పిడి చేసేందుకు ఆయన పలు ఇస్లామిక్ దేశాల నుంచి వందల కోట్ల రూపాయల నిధులు సేకరించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. మతమార్పిడిని 'లవ్ జిహాద్' ముసుగులో అమలు చేసే ఈ నెట్‌వర్క్, ముఖ్యంగా పేద, బలహీన వర్గాలకు చెందిన హిందూ మహిళలను టార్గెట్ చేసిందని అధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో ఈకార్యకలాపాలు విస్తరించాయని పేర్కొన్నారు. లక్నోలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ వద్ద వైద్యపరీక్షల అనంతరం మీడియాతో మాట్లాడిన ఛంగూర్ బాబా తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.

Details

కేంద్ర

"నేను నిర్దోషిని.. నన్ను కావాలనే విమర్శిస్తున్నారు" అని వెల్లడించారు. అయితే అధికార వర్గాల దృష్టిలో పరిస్థితి భిన్నంగా ఉంది. సమాచారం ప్రకారం, పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలు పెంచుకునేందుకు ఛంగూర్ బాబా ఖాట్మండుకు వెళ్లినట్లు తెలుస్తోంది. మత మార్పిడిలో భాగంగా, ఇస్లాంలోకి మార్చిన హిందూ మహిళలను నేపాల్‌లో ఉన్న ఐఎస్‌ఐ స్లీపర్ సెల్ సభ్యులతో వివాహం చేయాలనే కుట్ర కూడా రచించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసుపై ఉత్తరప్రదేశ్‌ పోలీసులు మాత్రమే కాదు.. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా విచారణ చేపట్టినట్లు సమాచారం. చర్చనీయాంశంగా మారిన ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపుతోంది.