LOADING...
West bengal: పశ్చిమ బెంగాల్‌ లో అకస్మాత్తుగా కూలిన బొగ్గు గని.. శిథిలాల కింద పలువురు కార్మికులు!
శిథిలాల కింద పలువురు కార్మికులు!

West bengal: పశ్చిమ బెంగాల్‌ లో అకస్మాత్తుగా కూలిన బొగ్గు గని.. శిథిలాల కింద పలువురు కార్మికులు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 13, 2026
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అసన్సోల్ ప్రాంతంలో బొగ్గు గనిలో తీవ్ర ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. బోర్డిలా పరిసరాల్లో ఉన్న గని ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ పని చేస్తున్న పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారని తెలుస్తోంది. ఘటన విషయం తెలియగానే సహాయక బృందాలు, పోలీసు సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే గనిలో ఎంతమంది కార్మికులు చిక్కుకున్నారన్న పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు. ప్రస్తుతం శిథిలాలను తొలగిస్తూ రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి.

వివరాలు 

రంగంలోకి రెస్క్యూ టీమ్ 

ఇదిలా ఉండగా, ప్రమాదానికి గురైన గని అక్రమ మైనింగ్‌కు సంబంధించినదిగా ప్రాథమికంగా గుర్తించారు. అక్రమ తవ్వకాల కారణంగానే గని ఒక్కసారిగా కూలిపోయినట్లు సమాచారం. శిథిలాల కింద ఎంతమంది ఉన్నారన్నది స్పష్టత లేకపోవడంతో కార్మికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భారీ యంత్రాలను రంగంలోకి దింపి రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కూలిన బొగ్గు గని

Advertisement