Page Loader
COVID-19: పశ్చిమ బెంగాల్‌లో 41 కొత్త కోవిడ్-19 కేసులు, ఒకరు మృతి 
పశ్చిమ బెంగాల్‌లో 41 కొత్త కోవిడ్-19 కేసులు, ఒకరు మృతి

COVID-19: పశ్చిమ బెంగాల్‌లో 41 కొత్త కోవిడ్-19 కేసులు, ఒకరు మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2025
02:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లో కరోనా వైరస్‌ మరింత వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా ఒకే రోజులో అక్కడ కొత్తగా 41 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అంతేకాకుండా, కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ఓ మహిళ మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. హౌరా నగరానికి చెందిన ఒక మహిళకు కరోనా సోకడంతో ఆమెను కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ఆమెకు కరోనా వైరస్‌తో పాటు గుండె,మూత్రపిండ సమస్యలు కూడా ఉండటంతో ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు వివరించారు. చికిత్స పొందుతుండగానే సోమవారం రాత్రి ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు.

వివరాలు 

ప్రస్తుతం 372 కరోనా కేసులు

కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 372కు చేరుకుందని ఆరోగ్య శాఖ పేర్కొంది. గడచిన 24 గంటల వ్యవధిలో 11 మంది కరోనా బాధితులు కోలుకున్నారని, అదే సమయంలో 41 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 372 కరోనా కేసులు ఉన్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారికంగా తెలిపింది.