LOADING...
Bengal SIR: పశ్చిమబెంగాల్‌లో 58 లక్షల ఓట్లు తొలగింపు
పశ్చిమబెంగాల్‌లో 58 లక్షల ఓట్లు తొలగింపు

Bengal SIR: పశ్చిమబెంగాల్‌లో 58 లక్షల ఓట్లు తొలగింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 16, 2025
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో సవరణలు చేపట్టింది. వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఈ ప్రక్రియలో మొత్తం 58 లక్షల ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. తొలగింపులకు గల కారణాలను కూడా వివరించారు. జాబితా నుంచి తొలగించిన వారిలో 24 లక్షల మంది మృతి చెందినవారని,19 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడ స్థిరపడినట్లు గుర్తించామని తెలిపారు. అలాగే 12లక్షల మంది ఆచూకీ లభించకపోవడంతో తప్పిపోయినవారిగా నమోదు చేయగా,1.38 లక్షల మంది నకిలీ ఓటర్లుగా తేలినట్లు పేర్కొన్నారు.

వివరాలు 

ఫిబ్రవరి 2026లో తుది ఓటరు జాబితా విడుదల

ఇవే కాకుండా ఇతర కారణాలతో మరో 57 వేల మంది పేర్లను కూడా తొలగించినట్లు వెల్లడించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా 'ఎస్‌ఐఆర్‌' పనులను నవంబర్ 4న ప్రారంభించారు. మొదట ఈ ప్రక్రియకు నెల రోజుల గడువు నిర్ణయించగా, అనంతరం వారం రోజులు, మరోసారి మూడు రోజులు అదనంగా పొడిగించారు. చివరికి ఆదివారంతో ఈ పనులు పూర్తయ్యాయి. ముసాయిదా ఓటరు జాబితా విడుదలైన నేపథ్యంలో నేటి నుంచి జనవరి 17 వరకు మార్పులు, చేర్పులు లేదా అభ్యంతరాలను తెలియజేయడానికి ఓటర్లకు అవకాశం కల్పించనున్నారు. అన్ని అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది ఓటరు జాబితాను ఫిబ్రవరి 2026లో విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

Advertisement