NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Doctors Protest: దేశవ్యాప్తంగా బంద్‌కు డాక్టర్ల సంఘం FAIMA పిలుపు 
    తదుపరి వార్తా కథనం
    Doctors Protest: దేశవ్యాప్తంగా బంద్‌కు డాక్టర్ల సంఘం FAIMA పిలుపు 
    దేశవ్యాప్తంగా బంద్‌కు డాక్టర్ల సంఘం FAIMA పిలుపు

    Doctors Protest: దేశవ్యాప్తంగా బంద్‌కు డాక్టర్ల సంఘం FAIMA పిలుపు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 14, 2024
    09:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమ బెంగాల్‌లో ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో రెండవ సంవత్సరం మహిళా ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లు గత 65 రోజులుగా నిరసనలు చేపడుతున్నారు.

    ఈ నేపథ్యంలో, వారికి మద్దతుగా నేటి (అక్టోబర్ 14) నుంచి ఎలక్టివ్ సర్వీసులను బహిష్కరించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (FAIMA) ఆదివారం దేశవ్యాప్తంగా వైద్య సంఘాలు, రెసిడెంట్ డాక్టర్లను కోరింది.

    అయితే, ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని దాదాపు 79 మంది సీనియర్ వైద్యులు, అధ్యాపకులు తమ పదవులకు రాజీనామా చేసినట్లు FAIMA ప్రకటించింది, ఇది ట్రైనీ డాక్టర్లకు సంఘీభావంగా జరుగుతోంది.

    వివరాలు 

    అత్యవసర చికిత్సలు మినహా మిగతావి నిలిపివేస్తున్నట్లు ప్రకటన 

    ప్రస్తుతం, నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైద్యుల పట్ల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని FAIMA ఆరోపిస్తోంది.

    అలాగే, తమ సహోద్యోగులకు సంఘీభావంగా వైద్యులపై పెరుగుతున్న హింసకు వ్యతిరేకంగా నేటి నుంచి అత్యవసర చికిత్సలు మినహా మిగతావి నిలిపివేస్తున్నట్లు వారు ప్రకటించారు.

    పశ్చిమ బెంగాల్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య నిపుణులకు భద్రతను కల్పించాలని FAIMA డిమాండ్ చేసింది.

    మరోవైపు, డాక్టర్ల నిరసనలో బీజేపీ కార్యకర్తలు, బెంగాల్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వెస్ట్ బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత్ మజుందార్ కోరారు.

    ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో వైద్యుల డిమాండ్లను నెరవేరుస్తామని మమతా బెనర్జీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ ఇప్పుడు దానిని తుంగలో తొక్కిందని ఆయన విమర్శించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    FAIMA డాక్టర్స్ అసోసియేషన్ చేసిన ట్వీట్ 

    🚨In solidarity with our West Bengal colleagues,

    who have protested over 65 days for safer work conditions, and to protest

    against the apathy shown by the West Bengal government towards our

    colleagues on *indefinite hunger strike for a week*,

    as well as the ever… pic.twitter.com/MZ74j9TZtC

    — FAIMA Doctors Association (@FAIMA_INDIA_) October 13, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పశ్చిమ బెంగాల్

    తాజా

    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్
    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం

    పశ్చిమ బెంగాల్

    TMC Leader Abhishek Benarji: టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ హెలీకాప్టర్ లో ఐటీ సోదాలు కోల్‌కతా
    PM Modi vs Mamata Banerjee: శ్రీరామ నవమి వేడుకలపై పశ్చిమ బెంగాల్‌ లో బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం నరేంద్ర మోదీ
    Westbengal: ముర్షిదాబాద్‌లో రామనవమి ఊరేగింపు సందర్భంగా ఘర్షణ.. అనేకమంది గాయలు ..  శ్రీరామ నవమి
    TV Anchor -Live-Unconcious-Lopa Mudra:లైవ్‌లో సొమ్మసిల్లి పడిపోయిన టీవీ యాంకర్‌ సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025