Bangladesh: పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో కిల్లర్ డ్రోన్లను మోహరించిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ తరచుగా దాడులు చేపట్టడం కొనసాగిస్తోంది. ఇటీవల, టర్కీలో తయారైన బేరక్తర్ టీబీ2 డ్రోన్‌ను పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో మోహరించారు. ఈ ఘటనపై ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందడంతో, భారత్ అప్రమత్తమై నిఘా చర్యలను పెంచింది. సైన్యం కూడా ఈ డ్రోన్ మోహరింపు విషయంపై నివేదికలు పరిశీలించినట్లు సమాచారం. బంగ్లాదేశ్ 67వ ఆర్మీ యూనిట్ ఈ డ్రోన్లను ఇంటెలిజెన్స్, నిఘా, గస్తీ వంటి పనుల కోసం ఉపయోగిస్తోంది. హసీనా ప్రభుత్వం కూలిపోయిన తరువాత, పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలు గణనీయంగా పెరిగాయి. సుమారు 700 మంది ఉగ్రవాదులు,ఖైదీలు జైళ్ల నుంచి తప్పించుకొని,బంగ్లాదేశ్‌లో తిరుగుతున్నారు. కాగా,సరిహద్దుల వద్ద తీవ్రవాదులు,స్మగ్లింగ్ ముఠాలు బలపడుతున్నాయి అని ఇంటెలిజెన్స్ నివేదికలు తెలియజేశాయి.
టర్కీ నుంచి బేరక్తర్ డ్రోన్ల కొనుగోలు
ఈ ఏడాది మొదట్లో, బంగ్లాదేశ్ ప్రభుత్వం టర్కీ నుంచి బేరక్తర్ డ్రోన్లను కొనుగోలు చేసింది. ఈ డ్రోన్లు తేలికపాటి దాడులను కూడా నిర్వహించగలవు. బంగ్లాదేశ్ 12 డ్రోన్లను ఆర్డర్ చేసినప్పటికీ, వాటిలో 6 ఇప్పటికే ఆ దేశానికి అందాయి. ఈ డ్రోన్లు 25,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలవు మరియు లేజర్ గైడెడ్ బాంబులను ప్రయోగించగలవు. ముఖ్యంగా శతఘ్నులు, ట్యాంక్‌లకు ఈ డ్రోన్లు పెద్ద సమస్యలు రేచ్చగలవు. ఉక్రెయిన్ యుద్ధంలో కూడా రష్యా ట్యాంకులపై ఇవి దాడులు చేశాయి. ఇప్పటికే, టర్కీ నుంచి బంగ్లాదేశ్ సైన్యం వివిధ రకాల అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేసింది. ఇందులో రాకెట్ డిఫెన్స్ సిస్టమ్స్, మైన్ రెసిస్టెంట్ వెహికల్స్, ఆర్మ్‌డ్ పర్సనల్ క్యారియర్స్ వంటి వాటి ఉన్నాయి.
హిందూ మైనార్టీలపై తీవ్రమైన దాడులు
బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం కూలిపోయిన తరువాత, ప్రధానమంత్రి షేక్ హసీనా భారత్‌కు వచ్చారు. అనంతరం మొదలైన అల్లర్లలో హిందూ మైనార్టీలపై తీవ్రమైన దాడులు జరిగాయి. ఈ పరిస్థితి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తలెత్తించింది.