LOADING...
Food poisoning: బెంగాల్‌లో విషాదం.. ఫుడ్‌ పాయిజనింగ్‌తో 100 మంది విద్యార్థులకు అస్వస్థత
బెంగాల్‌లో విషాదం.. ఫుడ్‌ పాయిజనింగ్‌తో 100 మంది విద్యార్థులకు అస్వస్థత

Food poisoning: బెంగాల్‌లో విషాదం.. ఫుడ్‌ పాయిజనింగ్‌తో 100 మంది విద్యార్థులకు అస్వస్థత

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2025
01:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అక్కడి ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ మదర్సాలో దాదాపు 100 మంది విద్యార్థులు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్‌ పాయిజనింగ్ కారణంగా శనివారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంఘటన అన్స్‌గ్రామ్ పరిధిలోని పిచ్‌కురి నవాబియా మదర్సాలో చోటుచేసుకుంది. మొదట 7 నుంచి 8 మంది విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతుండగా, గంట గంటకు బాధితుల సంఖ్య పెరిగింది. వెంటనే వారిని గుస్కర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

Details

ఇద్దరి పరిస్థితి విషమం

తరువాత పరిస్థితి విషమించడంతో వారిని బుర్ద్వాన్ మెడికల్ కాలేజీకి షిఫ్ట్ చేశారు. మొత్తం 100 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చేరగా, వారిలో 30 మంది వయస్సు 12 ఏళ్ల లోపే ఉన్నారని వైద్యులు తెలిపారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. ఈ ఘటనపై జిల్లా ఆహారశాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మదర్సా అధ్యక్షుడు షేక్ అస్రఫ్ అలీ మాట్లాడుతూ, "శుక్రవారం రాత్రి విద్యార్థులు రైస్, సోయాబీన్స్, బంగాళదుంప కూర తిన్నారు. ఇది మా మదర్సాలో సాధారణ భోజనం" అని చెప్పారు. ప్రస్తుతం ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ మదర్సాలో మొత్తం 250 మంది విద్యార్థులు రెసిడెన్షియల్ విధానంలో ఉంటున్నట్లు సమాచారం.