
BJP MP Khagen Murmu: బీజేపీ ఎంపీపై రాళ్ల దాడి.. తలకు తీవ్రగాయం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ మాల్దా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ ఖగెన్ ముర్ముపై రాళ్ల దాడి జరగడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జల్‌పాయీగూడీ ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది, అప్పటికే బీజేపీ ప్రతినిధుల బృందం వరద ప్రభావిత ప్రాంతాన్ని పర్యటిస్తూ సహాయసామగ్రి పంపిణీ చేస్తున్న సమయంలో జరిగింది. ఎంపీ ఖగెన్ ముర్ము తో పాటు స్థానిక ఎమ్మెల్యే శంకర్ ఘోష్ కూడా వరద బాధితులను ఆదుకోవడంలో పాల్గొంటున్నారు. ఈ దాడికి ముందు బీజేపీ ప్రతినిధులను అడ్డుకునేందుకు 500 మందికిపైగా స్థానికులు రహదారులపై బైటాయించారు. 'గో బ్యాక్' అనే నినాదాలతో భాజపా బృందాన్ని అడ్డుకున్నారు. ఈ దాడిలో గాయపడిన ఎంపీ, ఎమ్మెల్యేలను వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.
Details
దాడిని ఖండించిన బీజేపీ
ఈ ఘటనపై బీజేపీ స్పందించింది. పార్టీ నేత అమిత్ మాలవీయ ఎక్స్‌లో పోస్టు చేస్తూ, "బెంగాల్‌లో తృణమూల్ ఆటవిక రాజ్యం నడుస్తోందని విమర్శించారు. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిన తర్వాత ప్రభావిత ప్రాంతానికి ఎంపీ వెళ్తుండగా టీఎంసీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు. మమతా బెనర్జీ ప్రభుత్వం వరద బాధితులకు తగిన సాయం అందించడంలో విఫలమైందని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో, అధికార పార్టీ, విపక్ష పార్టీల మధ్య రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ రాజకీయ పరిస్థితుల్లోనే ఈ దాడి చోటుచేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాశమైంది.