LOADING...
Earthquake today: బంగాళాఖాతంలో భూకంపం.. 5.1 తీవ్రతతో ప్రకంపనలు 
బంగాళాఖాతంలో భూకంపం.. 5.1 తీవ్రతతో ప్రకంపనలు

Earthquake today: బంగాళాఖాతంలో భూకంపం.. 5.1 తీవ్రతతో ప్రకంపనలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2025
08:12 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మంగళవారం భూకంప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైనట్టు తెలుస్తోంది. భూకంప కేంద్రం బంగాళాఖాతంలో ఉండగా, దాని లోతు 91 కిలోమీటర్లు అని అధికారులు వెల్లడించారు. ఈ భూకంపాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ కూడా ధృవీకరించింది.

వివరాలు 

నష్టంపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు 

భూకంపం వల్ల జరిగిన గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు. కోల్‌కతాలో భూకంప కేంద్రం నగరానికి చాలా దూరంలో ఉండటంతో పెద్దగా ప్రభావం పడలేదు. భూకంప కేంద్రం భూమికి 91 కిలోమీటర్ల లోతులో ఉండటంతో, దీని ప్రభావం తక్కువగానే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా, భూమికి ఐదు లేదా 10 కిలోమీటర్ల లోతులో సంభవించే భూకంపాలు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి, అయితే లోతుగా సంభవించిన భూకంపాల ప్రభావం తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.

వివరాలు 

గతంలో కూడా భూకంపాలు 

ఈ ఏడాది జనవరి 8న టిబెట్‌లోని మారుమూల ప్రాంతాలు, నేపాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో శక్తివంతమైన భూకంపం సంభవించడంతో కోల్‌కతాలో స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి. ఉత్తర బెంగాల్‌లో కూడా ప్రకంపనలు సంభవించాయి, అయితే ఎటువంటి నష్టం జరగలేదు. అంతకుముందు, అర్ధరాత్రి 12:23 గంటల ప్రాంతంలో మణిపూర్‌లోని ఉఖ్రుల్‌లో 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది, దీని లోతు 10 కిలోమీటర్లు. గత కొన్ని రోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. దీని కారణంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవల, దేశ రాజధాని ఢిల్లీతో పాటు అనేక రాష్ట్రాల్లో ఒకేసారి భూకంప ప్రకంపనలు సంభవించాయి.

వివరాలు 

ఉత్తరప్రదేశ్‌లో భూకంపం 

ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3:24 గంటలకు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో 2.8 తీవ్రతతో భూకంపం నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం, భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉంది. ఈ వారం ప్రారంభంలో, ఫిబ్రవరి 17 ఉదయం ఢిల్లీలో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా భయాందోళనకు గురైన ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. ఉదయం 5.36 గంటలకు సంభవించిన ఈ భూకంప కేంద్రం నైరుతి ఢిల్లీలోని ధౌలా కువాన్ వద్ద ఉండటంతో, దాని ప్రభావం మొత్తం నేషనల్ కాపిటల్ రీజియన్ (NCR)లో కనిపించింది. భూకంపం కేవలం కొన్ని సెకన్లపాటు మాత్రమే కొనసాగినప్పటికీ, దాని లోతు 5 కిలోమీటర్లు కావడంతో ప్రభావం గణనీయంగా కనిపించింది.