LOADING...
Udayanidhi Stalin: ఇండియా కూటమి నాయకత్వంపై చర్చలు.. డీఎంకే కీలక వ్యాఖ్యలు
ఇండియా కూటమి నాయకత్వంపై చర్చలు.. డీఎంకే కీలక వ్యాఖ్యలు

Udayanidhi Stalin: ఇండియా కూటమి నాయకత్వంపై చర్చలు.. డీఎంకే కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 23, 2026
12:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

విపక్షాల 'ఇండియా' కూటమిలో నాయకత్వ మార్పు అంశంపై (Opposition Leadership Row) కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నాయకత్వ పోటీలో డీఎంకే కూడా ప్రవేశించింది. ఇటీవల తమిళనాడులో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్న ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాజకీయాలు,పరిపాలన రంగాల్లో తన తండ్రి, తమిళనాడు ముఖ్యమంత్రి MK Stalinను పలువురు నేతలు ఆదర్శంగా భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇండియా కూటమికి నాయకత్వం వహించాల్సిందిగా వివిధ రాష్ట్రాల ప్రతిపక్ష నాయకులు ఆయనను అభ్యర్థిస్తున్నారని తెలిపారు. భాజపాకు వ్యతిరేకంగా సాగుతున్న ఇండియా కూటమి పోరాటానికి స్టాలిన్‌ ముందుండాలని తమ ఆకాంక్ష కూడా అదే అని స్పష్టం చేశారు.

వివరాలు 

ఇండియా కూటమిని సమర్థంగా నడిపించగల సామర్ధ్యం మమతా బెనర్జీకి ఉంది 

ఇక త్వరలో నిర్వహించనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌-డీఎంకే మధ్య సీట్ల పంపకాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో కూటమి నాయకత్వ మార్పు అంశాన్ని ఉదయనిధి ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రమే ఇండియా కూటమిని సమర్థంగా నడిపించగలరని సమాజ్‌వాదీ పార్టీ, ఎన్సీపీ, శివసేన (యూబీటీ), ఆర్జేడీ వంటి పక్షాలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నాయి.

Advertisement