Loading...
US-Iran War: ఇరాన్‌పై అమెరికా దాడులు ఉద్ధృతం.. చాబహార్‌ టవర్‌తో పాటు వంతెనలు ధ్వంసం
ఇరాన్‌పై అమెరికా దాడులు ఉద్ధృతం.. చాబహార్‌ టవర్‌తో పాటు వంతెనలు ధ్వంసం

US-Iran War: ఇరాన్‌పై అమెరికా దాడులు ఉద్ధృతం.. చాబహార్‌ టవర్‌తో పాటు వంతెనలు ధ్వంసం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2026
09:18 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లో కీలక పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఆరో రోజు వరుసగా వైమానిక దాడులు కొనసాగించింది. ఈ దాడులతో దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ముఖ్యమైన రహదారులు మూసివేయబడగా, సాధారణ ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేశ దక్షిణ ప్రాంతంలోని పలు నగరాలు, దీవులపై అమెరికా బాంబు దాడులు జరిపింది. అహ్‌వాజ్‌, ఖేష్మ్‌, దాష్తి, సిరిక్‌, బందర్‌-ఎ-లెంగే ప్రాంతాల్లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. బందర్‌-ఎ-ఖమీర్‌లోని రెండు కీలక వంతెనలు ధ్వంసమయ్యాయి. అలాగే బందర్‌ అబ్బాస్‌లోనూ వరుస పేలుళ్లు నమోదయ్యాయి. హర్మూజ్‌ ప్రావిన్స్‌లోని రోడ్డు, రైల్వే నెట్‌వర్క్‌ను అమెరికా లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది.

వివరాలు 

అమెరికా దాడుల్లో ముగ్గురు మృతి 

ఇరాన్‌షహర్‌ విమానాశ్రయంపైనా బాంబుదాడి జరగడంతో అక్కడి విద్యుత్‌ సరఫరా దెబ్బతింది. కిష్‌ ద్వీపంలో జరిగిన దాడుల కారణంగా విద్యుత్‌ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.

అమెరికా దాడుల్లో ముగ్గురు మరణించినట్లు ఇరాన్‌ అధికారులు వెల్లడించారు.

చాబహార్‌లోని మారిటైమ్‌ కంట్రోల్‌ టవర్‌పై అమెరికా మూడోసారి దాడి చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా,తాజా విడత దాడులు ముగిసినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ప్రకటించింది.

ఈ ఆపరేషన్‌లో ఫైటర్‌ జెట్లు, డ్రోన్లు, యుద్ధనౌకలను వినియోగించినట్లు తెలిపింది.

వివరాలు 

50వేల మంది అమెరికా సైనిక సిబ్బంది విధులు

ఇరాన్‌కు చెందిన రక్షణ,లాజిస్టిక్స్‌,నిఘా వ్యవస్థలు,సముద్ర భద్రతా సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది.

ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో దాదాపు 50వేల మంది అమెరికా సైనిక సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు కూడా పేర్కొంది.

మరోవైపు అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్‌ ఖతార్‌, బహ్రెయిన్‌లపై క్షిపణులు, డ్రోన్లతో ఎదురుదాడులు చేపట్టినట్లు సమాచారం.

ADVERTISEMENT