Loading...
P.V. Sindhu: క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్
క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్

P.V. Sindhu: క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 17, 2026
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టార్‌ షట్లర్‌ పివి.సింధు జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ఫైనల్‌ పోరులో ఆమె ప్రపంచ ఐదో ర్యాంకర్‌ హాన్‌ యీ (చైనా)పై నేరుగా రెండు గేమ్‌లలో విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో సింధు 21-16, 21-14 స్కోరుతో హాన్‌ యీకి షాక్‌ ఇచ్చింది. తొలి గేమ్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనా, కీలక సమయాల్లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించిన సింధు గేమ్‌ను తన ఖాతాలో వేసుకుంది.

వివరాలు

ఫుల్ ఫామ్ లో పివి.సింధు

అనంతరం రెండో గేమ్‌లో మరింత దూకుడుగా ఆడిన ఆమె ఆరంభంలోనే వరుస పాయింట్లు సాధిస్తూ 8-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

హాన్‌ యీ తిరిగి పోటీనిచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ, సింధు ఏమాత్రం తడబడకుండా తన ఆధిపత్యాన్ని కొనసాగించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది.

ఇదిలా ఉండగా, మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ఫైనల్‌లో భారత జోడీ తనీషా క్రాస్టో-ధ్రువ్‌ కపిలకు నిరాశ ఎదురైంది.

చైనాకు చెందిన ఫెంగ్‌ యాన్‌-హువాంగ్‌ డంగ్‌ జోడీ చేతిలో వారు 20-22, 17-21 తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.

ADVERTISEMENT