LOADING...
ED: ముర్షిదాబాద్‌లో ఈడీ దాడులు.. పారిపోవడానికి గోడ దూకిన ఎమ్మెల్యే!
ముర్షిదాబాద్‌లో ఈడీ దాడులు.. పారిపోవడానికి గోడ దూకిన ఎమ్మెల్యే!

ED: ముర్షిదాబాద్‌లో ఈడీ దాడులు.. పారిపోవడానికి గోడ దూకిన ఎమ్మెల్యే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 25, 2025
03:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలను షేక్‌ చేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో(Teachers Recruitment Scam) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) కొనసాగుతున్న దాడులు మరో విభిన్న పరిణామానికి దారితీశాయి. ముర్షిదాబాద్ జిల్లాలోని తృణమూల్ కాంగ్రెస్‌ (TMC) ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహా(MLA Jiban Krishna Saha) నివాసం సహా అతనికి సంబంధించిన పలు ప్రదేశాలపై ED అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే సోదాల సమాచారాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే తన ఇంటి మొదటి అంతస్తు నుంచి కిందకు దూకి, గోడ దూకి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో బయట ఎదురైన అధికారులు కృష్ణ సాహాను అదుపులోకి తీసుకున్నారు. పారిపోవడంలో కృష్ణ సాహా తన వద్ద ఉన్న సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి మొబైల్‌ ఫోన్‌ను ఇంటి సమీప చెరువులో విసిరేశాడు.

Details

25,753 మందికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు

మరో రెండు ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్‌ విశ్లేషణకు పంపారు. ఇంటి నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన కారణాలను తెలుసుకోవడానికి కృష్ణ సాహాను విచారిస్తున్నారు. అనంతరం ఆయనను కోల్‌కతాలోని ప్రత్యేక ED కోర్టు ముందు హాజరుపరచనున్నారు. రఘునాథ్‌గంజ్‌ ప్రాంతంలోని ఎమ్మెల్యే అత్తమామలకు చెందిన ఇళ్లలోనూ సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో జిబన్ కృష్ణ సాహా 2023 ఏప్రిల్‌లో సీబీఐ అరెస్టు చేసి, 2025 మేలో బెయిల్‌పై విడుదల అయ్యాడు.

Details

25,753 మందికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు

ఉపాధ్యాయ నియామక కుంభకోణం వెనుక కారణం 2016లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతుల ఉపాధ్యాయులు, గ్రూప్‌ C,D సిబ్బందిని నియమించేందుకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి సెలక్షన్‌ పరీక్ష. ఈ పరీక్షలో 24,650 ఖాళీల భర్తీ కోసం 23 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. తర్వాత 25,753 మందికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చారు. అయితే నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెలువడ్డాయి. దీనిపై న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి, ఆ తర్వాతి దర్యాప్తులు కొనసాగుతున్నాయి. ఈ దాడులు, మాజీ ఎమ్మెల్యే ప్రవర్తన, నియామక అవకతవకల అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో