West Bengal: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ నేతలపై కాల్పులు.. ఇద్దరి పరిస్థితి విషమం
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి పండగ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఈసారి మాల్డాలో టీఎంసీ నేత, పార్టీ కార్యకర్తపై కాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉంది. ఇదే జిల్లాలో జనవరి 2న టీఎంసీ కౌన్సిలర్‌ను దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే.
ఈ ఘటన మరువక ముందే మరో కాల్పుల ఘటన సంభవించడం తీవ్ర సంచలనం సృష్టించింది. మంగళవారం కలియాగంజ్ ప్రాంతంలో రోడ్డు ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది.
Details
ప్రత్యక్ష సాక్షుల్ని విచారిస్తున్నాం
ఈ కార్యక్రమానికి టీఎంసీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ క్రమంలో కాల్పులు జరిగాయి. కాల్పుల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సీనియర్ అధికారి చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, ఘటనాస్థలిలో ఉన్న ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నామని తెలిపారు.
ఘటనకు కారణం త్వరలోనే వెల్లడి అవుతుందని పేర్కొన్నారు. గాయపడిన వారిలో ఒకరు టీఎంసీ స్థానిక కమిటీ అధ్యక్షుడు బకుల్ షేక్‌గా పోలీసులు గుర్తించారు.