'Arjikar' case: 'ఆర్జీకర్' కేసు.. దోషి శిక్షపై బెంగాల్ హైకోర్టు కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా ఆర్జీకర్ కాలేజీ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో, దోషి సంజయ్ రాయ్ శిక్షపై కోల్‌కతా హైకోర్టు బుధవారం కీలక విచారణ చేపట్టింది.
ఈ కేసులో బెంగాల్ ప్రభుత్వం వేసిన అప్పీల్‌పై హైకోర్టు అన్ని వాదనలు పూర్తిగా వినాకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
సంజయ్ రాయ్‌కి విధించిన శిక్ష సరిపోదని పేర్కొంటూ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు, సీబీఐ, బాధితురాలి కుటుంబం, దోషి వాదనలు సోమవారం వింటామని ప్రకటించింది.
ఈ ప్రక్రియ పూర్తయ్యాకే తుది తీర్పు ఇవ్వనున్నట్లు హైకోర్టు తెలిపింది. సీబీఐ, ఈ కేసులో అప్పీల్ వేసే హక్కు తమకే ఉందని, ప్రభుత్వానికి లేదని కోర్టులో తమ వాదనను వినిపించింది.
Details
జీవిద ఖైదు సరిపోదని డిమాండ్
దీనిపై కూడా హైకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. ఇక, బాధితురాలి తల్లిదండ్రులు కూడా ఈ కేసు పరిష్కారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సంజయ్ రాయ్‌కి విధించిన జీవితఖైదు శిక్ష సరిపోదని, మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కూడా బుధవారం విచారణ జరిపింది. సంజయ్ రాయ్ శిక్షపై బాధితురాలి తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో కోల్‌కతాలో ప్రజల మధ్య ఆందోళనలు మళ్లీ ఊపందుకున్నాయి.
సంజయ్ రాయ్‌కి మరణశిక్ష విధించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఈ కేసు తీర్పు ప్రజల న్యాయవ్యవస్థపై విశ్వాసానికి కీలకమైనదిగా మారనుంది.