Stray Dogs: వీధి కుక్కల రక్షణలో నవజాత శిశువు: నదియా ఘటన వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడుల కారణంగా చిన్నారులపై విషాదం కలిగించే వార్తలు వస్తున్న తరుణంలో, ఓ శిశువు కోసం వీధి కుక్కలు రక్షకులుగా మారిన ఘట్టం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో, ఒక నవజాత శిశువును తల్లిదండ్రులు రోడ్డుపై వదిలిన సమయంలో, ఆ చిన్నారికి రక్షణగా వీధి కుక్కలు నిలిచాయి. స్థానికుల వివరాల ప్రకారం, నదియా జిల్లాలోని రైల్వే వర్కర్స్ కాలనీలో బుధవారం తెల్లవారుజామున, బాత్‌రూమ్ ముందు అప్పుడే పుట్టిన శిశువును తల్లిదండ్రులు వదిలి వెళ్లారు. దుప్పటిలో చుట్టి ఉన్న శిశువును చూసి, కొన్ని వీధి కుక్కలు చేరి, రాత్రంతా ఆ చిన్నారికి రక్షణగా నిలిచాయి.
వివరాలు
చలిలో కొన్ని గంటల పాటు.. పసికందుకు కాపలాగా..
తెల్లవారిన తర్వాత, కుక్కల మధ్య శిశువు ఉన్నట్లు గమనించిన స్థానికులు వెంటనే ఆ పసికందును ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పసికందుపై కుక్కలు వ్యవహరించిన తీరును స్థానికులు ప్రశంసిస్తున్నారు. చలిలో కొన్ని గంటల పాటు.. పసికందుకు కాపలాగా నిలబడే ఉన్నట్లు పేర్కొన్నారు. శిశువును ఆస్పత్రికి తీసుకెళ్తూ, కుక్కలు ముందు ఎవరినీ దగ్గరగా రాకుండా నిరోధించాయని స్థానికులు పేర్కొన్నారు. తరువాత పొరుగువారి సహాయంతో శిశువును మహేశ్‌గంజ్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, చిన్నారిని ఎవరు వదిలి వెళ్లారో తెలుసుకోవడానికి, సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
శిశువుని కాపాడిన వీధి కుక్కలు
Abandoned In Cold, Newborn Finds Unlikely Protectors In Pack Of Stray Dogs https://t.co/hPrLkvN3oJ pic.twitter.com/5h6UNfW7FS
— NDTV (@ndtv) December 2, 2025