LOADING...
Andhra news: పీపీపీ మంత్రంతో ఏపీకి కొత్త ఊపిరి.. 20% వరకు వీజీఎఫ్‌ ప్రకటించిన కేంద్రం
పీపీపీ మంత్రంతో ఏపీకి కొత్త ఊపిరి.. 20% వరకు వీజీఎఫ్‌ ప్రకటించిన కేంద్రం

Andhra news: పీపీపీ మంత్రంతో ఏపీకి కొత్త ఊపిరి.. 20% వరకు వీజీఎఫ్‌ ప్రకటించిన కేంద్రం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2026
08:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానం (పీపీపీ) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆశ్రయిస్తున్న ప్రధాన అభివృద్ధి మార్గంగా మారింది. భారత్‌లోనూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ విధానానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత్ భారత్) తీర్చిదిద్దాలంటే భారీ స్థాయిలో మౌలిక వసతుల కల్పన తప్పనిసరి అని కేంద్రం స్పష్టంగా భావిస్తోంది. ప్రభుత్వానికి అవసరమైనంత ఆర్థిక వనరులు అందుబాటులో లేని పరిస్థితుల్లో ప్రైవేటు రంగాన్ని భాగస్వామిగా చేసుకోవడం అనివార్యమని నిర్ణయానికి వచ్చింది. విమానాశ్రయాలు, ఓడరేవులు, జాతీయ రహదారులు వంటి లక్షల కోట్ల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులను పీపీపీ విధానంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది.

వివరాలు 

పీపీపీ విధానమే సరైన మార్గం 

ఇదే బాటలో రాష్ట్రాలు కూడా ముందుకు సాగాలంటూ ప్రోత్సహిస్తోంది. రాష్ట్రాలు అమలు చేసే పీపీపీ ప్రాజెక్టులకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కింద 20 శాతం వరకు ఆర్థిక సహాయం అందిస్తామని కేంద్రం ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. రాష్ట్ర విభజనతో ఏర్పడిన సమస్యలు, గత ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో చోటు చేసుకున్న లోపాల కారణంగా ఆంధ్రప్రదేశ్ తీవ్ర మౌలిక వసతుల కొరతను ఎదుర్కొంటోంది. ఆర్థిక పరిస్థితి కూడా పరిమితంగా ఉండటంతో దెబ్బతిన్న రహదారుల పునర్నిర్మాణానికే నిధులు వెతకాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో పోర్టులు, విమానాశ్రయాలు వంటి భారీ ప్రాజెక్టులను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే పీపీపీ విధానమే సరైన మార్గమని ప్రభుత్వం నిర్ణయించింది.

వివరాలు 

30 శాతం ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానం

కేంద్ర పథకాలు, నిధులు సాధించడంలో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పీపీపీ విధానంలో రాష్ట్రానికి గరిష్ఠ లాభాలు సాధించే దిశగా వేగంగా చర్యలు చేపట్టారు. ఫలితంగా 2026-27 నుంచి 2028-29 వరకు మూడేళ్ల కాలానికి కేంద్ర ఆర్థిక శాఖ రూపొందించిన పీపీపీ ప్రాజెక్టుల పైప్‌లైన్‌లో 30 శాతం ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. ప్రాజెక్టుల సంఖ్య, పెట్టుబడి విలువ పరంగా పెద్ద రాష్ట్రాలు కూడా ఏపీకి సమీపంలో లేవు. రెండో స్థానంలో ఉన్న తమిళనాడు 70 ప్రాజెక్టులనే నమోదు చేయగా, పశ్చిమ బెంగాల్ ఒక్క ప్రాజెక్టుతోనే సరిపెట్టుకుంది.

Advertisement

వివరాలు 

కేంద్ర స్ఫూర్తిని వేగంగా అందిపుచ్చుకుని.. 

వీజీఎఫ్ సహాయం అవసరమయ్యే ప్రాజెక్టులను తప్పనిసరిగా పైప్‌లైన్‌లో నమోదు చేయాలన్న కేంద్ర ఆర్థిక శాఖ సూచనలను ఏపీ ప్రభుత్వం వేగంగా అమలు చేసింది. నిర్ణీత గడువులోనే 270 ప్రాజెక్టులను నమోదు చేసింది. ఇంకా కొన్ని ప్రాజెక్టులను గుర్తించామని, వాటిని కూడా త్వరలోనే పైప్‌లైన్‌లో చేర్చుతామని రాష్ట్ర ఆర్థిక శాఖకు చెందిన ఉన్నతాధికారి తెలిపారు. ఎక్కువ ప్రాజెక్టులు నమోదు చేయడం ద్వారా కేంద్ర సహాయాన్ని గరిష్ఠంగా పొందే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

వివరాలు 

ముందస్తు కసరత్తుతోనే సాధ్యమైంది! 

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి విమానాశ్రయాలు, పోర్టులు, రహదారులు, పారిశ్రామిక మౌలిక వసతులు విస్తృతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కూటమి ప్రభుత్వం ఎప్పుడో అంచనా వేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే పీపీపీ విధానంలో ప్రాజెక్టులు చేపట్టేందుకు సమగ్రంగా కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పీపీపీ ప్రాజెక్టులకు వీజీఎఫ్ అందించేందుకు గత బడ్జెట్‌లో రూ.2,000 కోట్లు కేటాయించింది. పీపీపీ ప్రాజెక్టుల నిర్వహణ కోసం ఆర్థిక శాఖలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది.

వివరాలు 

ముందస్తు కసరత్తుతోనే సాధ్యమైంది! 

కేంద్ర ఆర్థిక శాఖకు ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపడం, పీపీపీకి అనుకూలమైన మౌలిక వసతులపై ఇతర శాఖలకు సూచనలు ఇవ్వడం, ఐఐపీడీఎఫ్, వీజీఎఫ్ గ్రాంట్లు పొందడంలో మార్గనిర్దేశం చేయడం వంటి బాధ్యతలను ఈ సెల్ నిర్వహిస్తోంది. కేంద్ర నమూనాలోనే రాష్ట్ర స్థాయిలోనూ పీపీపీ ప్రాజెక్టుల పైప్‌లైన్ సిద్ధం చేసింది. పీపీపీ పాలసీ, వీజీఎఫ్ పథకానికి ముసాయిదా మార్గదర్శకాలు రూపొందించి, ప్రాజెక్టుల అనుమతికి ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించింది.

వివరాలు 

రూ.25 లక్షల నుంచి రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల వరకు.. 

ఏలూరులో రూ.25 లక్షల వ్యయంతో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు నుంచి అమరావతిలో రూ.1,000 కోట్లతో విమానాశ్రయ నిర్మాణం వరకు—కేంద్ర సహాయం లభించే అవకాశం ఉన్న ప్రతి పీపీపీ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. విమానాశ్రయాలు, పోర్టులు, పీపీపీ విధానంలో నిర్మిస్తున్న ఆసుపత్రులు, జిల్లాల వారీగా రహదారుల పునర్నిర్మాణం, పట్టణ మౌలిక వసతులు, తాగునీటి సరఫరా వంటి అనేక ప్రాజెక్టులు పైప్‌లైన్‌లో చోటు దక్కించుకున్నాయి. కోనసీమ, కాకినాడ, రుషికొండ, లంబసింగి, అరకులో వాటర్ ఏరోడ్రోమ్‌ల వంటి పర్యాటక ప్రాజెక్టులు, కాంప్లెక్స్‌ల నిర్మాణం, పారిశ్రామిక వాడల అభివృద్ధి వంటి పనులు కూడా ఇందులో ఉన్నాయి.

వివరాలు 

ప్రత్యామ్నాయం కాదు..తప్పనిసరి అవసరం 

గతంలో పీపీపీ విధానాన్ని ఒక ఎంపికగా మాత్రమే చూశారు. ఇప్పుడు అది మౌలిక వసతుల అభివృద్ధికి తప్పనిసరి మార్గంగా మారింది. 2025-26 బడ్జెట్ నుంచే కేంద్ర ప్రభుత్వం పీపీపీ ప్రాజెక్టులకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోంది. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే 2030 నాటికి మౌలిక వసతులపై 4.5 నుంచి 5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమని అంచనా. ఈ స్థాయి పెట్టుబడులు ప్రభుత్వ బడ్జెట్‌తో మాత్రమే సాధ్యం కాదన్నది వాస్తవం. ప్రతి ఏడాది కేంద్రం రూ.11-12 లక్షల కోట్ల మూలధన వ్యయం చేస్తున్నా అవసరాలకు అది సరిపోవడం లేదు.

వివరాలు 

ప్రత్యామ్నాయం కాదు..తప్పనిసరి అవసరం 

పీపీపీ విధానంలో ప్రైవేటు పెట్టుబడిదారులు ప్రాజెక్టు స్వభావాన్ని బట్టి 50 నుంచి 70 శాతం వరకు పెట్టుబడి పెడతారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గడంతో పాటు ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పన సాధ్యమవుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను ఉపయోగించి ప్రాజెక్టులను వేగంగా, నాణ్యతతో పూర్తిచేయవచ్చు. నిర్వహణ బాధ్యతలు కూడా గడువు ముగిసే వరకూ ప్రైవేటు సంస్థలే చూసుకుంటాయి. దీంతో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. సప్లై చైన్ వ్యవస్థ బలపడుతుంది. ప్రాంతీయ అనుసంధానం మెరుగవుతుంది. లాజిస్టిక్స్ వంటి కీలక రంగాలు అభివృద్ధి చెందుతాయి. మొత్తంగా ఆర్థిక వృద్ధి వేగం పెరుగుతుంది.

వివరాలు 

కేంద్ర ప్రాజెక్టులకుఇవి అదనం 

కేంద్ర ఆర్థిక శాఖ రూపొందించిన పీపీపీ పైప్‌లైన్‌లో మొత్తం రూ.17 లక్షల కోట్ల విలువైన 852 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి 620 ప్రాజెక్టులు కాగా, అందులో ఏపీకి చెందినవే 270 ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రాజెక్టుల మొత్తం విలువ రూ.3,84,799 కోట్లు. మిగిలిన ప్రాజెక్టులన్నీ వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ శాఖలు అమలు చేయనున్నవే.

Advertisement