LOADING...
Holi 2026 : 2026లో హోలీ కోసం బెస్ట్ ప్రదేశాలు ఇవే!
2026లో హోలీ కోసం బెస్ట్ ప్రదేశాలు ఇవే!

Holi 2026 : 2026లో హోలీ కోసం బెస్ట్ ప్రదేశాలు ఇవే!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 27, 2026
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

2026లో హోలీ అంటే ఇక మీ కాలనీలో రంగులు చల్లుకోవడం మాత్రమే కాదు... డెస్టినేషన్ వైబ్ కూడా ముఖ్యం అంటున్నారు ట్రావెల్ లవర్స్. "విజిట్" కంటే "ఇమ్మర్షన్" అనుభవం కావాలనుకుంటున్న ట్రావెలర్స్ వల్ల, భారతదేశంలో హోలీ వేడుకలు ఇప్పుడు గ్లోబల్ బకెట్ లిస్ట్ ఈవెంట్‌గా మారిపోయాయి. బ్రజ్ ప్రాంతంలోని సంప్రదాయ హోలీలో తడవాలనుకుంటున్నారా? లేక పూలతో చేసే ప్రశాంత హోలీ కోసం పర్వతాల మధ్యకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే 2026 హోలీ కోసం స్పెషల్ గైడ్ ఇదే.

వివరాలు 

"రియల్ హోలీ" అనుభవం కావాలంటే.. ఈ ప్రదేశం బెస్ట్ 

మునుపెప్పుడో హోలీ అంటే ఇంటి వద్దే, పొరుగువారితో కలిసి ఆడుకునే పండుగ. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వృందావన్, పుష్కర్ లాంటి ప్రదేశాలకు దేశీయులతో పాటు విదేశీ వ్లాగర్లు కూడా భారీగా చేరుకుంటున్నారు. ఇక భవిష్యత్తు హోలీ మాత్రం సస్టైనబుల్ దిశగా వెళ్తోంది. ఆర్గానిక్ పూల రంగులు, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో డ్రై హోలీ, ఫోక్ మ్యూజిక్-ఆర్టిసన్ ఫుడ్‌తో గ్లాంపింగ్ హోలీ ఫెస్టివల్స్ ట్రెండ్ అవుతున్నాయి. "రియల్ హోలీ" అనుభవం కావాలంటే మథుర-వృందావన్ ఫస్ట్ ఛాయిస్ అంటున్నారు ట్రావెలర్స్. బాంకే బిహారి ఆలయంలో పూలతో చేసే ఫూలన్ వాలి హోలీ ఆధ్యాత్మికంగా ఉత్సాహాన్ని నింపుతుంది.

వివరాలు 

రాజసంగా హోలీ జరుపుకోవాలంటే..

బర్సానాలో జరిగే లాఠ్‌మార్ హోలీ ప్రత్యేక ఆకర్షణ. రాధా-కృష్ణల కథను గుర్తు చేస్తూ మహిళలు సరదాగా కర్రలతో పురుషులను ఆటపట్టించే సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ఇక పుష్కర్ అయితే ఓపెన్ ఎయిర్ డాన్స్ ఫ్లోర్‌లా మారిపోతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయ్యే హోలీ అంటే ఇదే అంటున్నారు యువత. రాజసంగా హోలీ జరుపుకోవాలంటే ఉదయపూర్, జైపూర్ టాప్ లిస్టులో ఉన్నాయి. మేవార్ రాజ కుటుంబం నేతృత్వంలో జరిగే హోలికా దహన్ ప్రదర్శన చూడదగ్గది. సాంస్కృతిక హోలీ అనుభవం కోసం పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్లో బసంత్ ఉత్సవ్ ప్రత్యేకం. రబీంద్రనాథ్ ఠాగూర్ ప్రారంభించిన ఈ వేడుకలో పసుపు చీరలు, సంప్రదాయ నృత్యాలు, అబీర్ రంగులు ప్రధాన ఆకర్షణ.

Advertisement

వివరాలు 

పంజాబ్‌లో హోలీ ఎలా జరుపుకుంటారంటే?

ఇక పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహిబ్లో జరిగే హోలా మొహల్లా కూడా చూడదగ్గది. నిహాంగ్ సిక్కులు యుద్ధ కళలు,గుర్రపు స్వారీ,ఖడ్గ విద్య ప్రదర్శిస్తారు. జనం రద్దీ,వేడి దూరంగా ఉండాలనుకుంటే హిమాచల్ ప్రదేశ్‌లోని సాంగ్లా వ్యాలీ బెటర్ ఆప్షన్. మంచు మధ్య స్థానిక వైన్,సంప్రదాయ నృత్యాలు,కమ్యూనిటీ విందుతో హోలీ జరుపుకుంటారు. మథురకు వెళ్లే ట్రైన్లు,జైపూర్-ఉదయపూర్ ఫ్లైట్స్ ముందుగానే బుక్ అవుతాయి. మార్చి నెలలో వేసవి మొదలవుతుంది కాబట్టి కొబ్బరి నూనె లేదా సన్‌స్క్రీన్ రాసుకుని బయటకు వెళ్లాలి. తండాయి వంటి పానీయాలు తాగేటప్పుడు నమ్మకమైన చోటే తీసుకోవాలి. ముఖ్యంగా మథుర, పుష్కర్‌లాంటి ప్రదేశాల్లో గ్రూప్‌గా ఆడుకోవడం మంచిది. 2026 హోలీ తేదీలు కూడా ఫిక్స్ అయ్యాయి.మార్చి 3న హోలికా దహన్,మార్చి 4న ధులివందన్ రంగుల పండుగ.

Advertisement

వివరాలు 

సోలో మహిళలకు ఉదయపూర్, శాంతినికేతన్ సేఫ్ ఆప్షన్స్

సోలో మహిళా ప్రయాణికులకు ఉదయపూర్, శాంతినికేతన్ సేఫ్ ఆప్షన్స్‌గా చెబుతున్నారు. శాకాహారం సులభంగా లభిస్తుంది. గుజియాలు, మల్పువాలు, దహీ భల్లే, కుంకుమపువ్వు తండాయి తప్పక రుచి చూడాలి. మథుర-వృందావన్ పూర్తి హోలీ అనుభవం కోసం నాలుగు రోజుల ట్రిప్ ప్లాన్ చేయడం మంచిది. సౌత్ ఇండియాలో హోలీని ఘనంగా జరుపుకునే ప్రదేశాల్లో హంపి కూడా ఒకటి. చివర్లో అందరూ కలిసి తుంగభద్ర నదిలో రంగులు కడుగుకోవడం ప్రత్యేకం. మొత్తానికి రాజస్థాన్ రాయల్ హెరిటేజ్ కావాలా, వృందావన్ ఆధ్యాత్మిక ఉత్సాహమా, లేక హిమాలయాల్లో ప్రశాంత హోలీనా... 2026 హోలీ భారతదేశాన్ని రంగుల మయం చేసే ఛాన్స్.

Advertisement