LOADING...
Gujarat: గుజరాత్‌లో శిక్షణ సమయంలో కూలిన ఫైటర్ జెట్.. పైలట్ దుర్మరణం!
గుజరాత్‌లో శిక్షణ సమయంలో కూలిన ఫైటర్ జెట్.. పైలట్ దుర్మరణం!

Gujarat: గుజరాత్‌లో శిక్షణ సమయంలో కూలిన ఫైటర్ జెట్.. పైలట్ దుర్మరణం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 03, 2025
10:25 am

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్‌లోని జామ్‌నగర్ సమీపంలో శిక్షణలో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిపోయింది. ఈ ఘటనలో ఒక పైలట్ మరణించగా, మరొక పైలట్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జామ్‌నగర్ నుంచి 12 కి.మీ దూరంలో ఉన్న సువార్ద గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే స్థానికులకు ఎలాంటి నష్టం జరగలేదు.

Details

ప్రమాద సమయంలో భారీగా ఎగిసిపడ్డ మంటలు 

విమాన ప్రమాదం సంభవించిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలను IAF కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ద్వారా దర్యాప్తు చేపట్టనుంది. సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్లు IAF ప్రకటన ప్రకారం రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు. విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు సాంకేతిక లోపాన్ని గుర్తించగానే ఎజెక్షన్ ప్రక్రియ ప్రారంభించారు. ఈ ప్రమాదంలో గ్రామస్తులకు ఎలాంటి హాని జరగకుండా పైలట్లు కృషి చేసినట్లు IAF వెల్లడించింది. మృతి చెందిన పైలట్ కుటుంబానికి అండగా ఉంటామని IAF హామీ ఇచ్చింది.

Details

అధికారుల నివేదిక

జామ్‌నగర్ కలెక్టర్ కేతన్ ఠక్కర్ ఈ ప్రమాదాన్ని ధ్రువీకరించారు. ఒక పైలట్ ప్రాణాలు కోల్పోగా, మరొకరిని రక్షించి ఆసుపత్రికి తరలించామని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తక్షణమే స్పందించి, మంటలను అదుపు చేసి పరిస్థితిని చక్కదిద్దారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కూలిన విమానం