LOADING...
Bomb Threats: గుజరాత్‌'లో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..
గుజరాత్‌'లో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..

Bomb Threats: గుజరాత్‌'లో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 17, 2025
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్‌లో బాంబు బెదిరింపులు ఒక్కసారిగా కలకలం రేపాయి. అహ్మదాబాద్‌లోని పలు పాఠశాలలకు బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై సంబంధిత పాఠశాలల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. నగర పరిధిలోని మహారాజా అగ్రసేన్ స్కూల్, వేజల్పూర్ జైడస్ స్కూల్,నిర్మాణ్ స్కూల్,డివైన్ స్కూల్, ఆవిష్కర్ స్కూల్, కలోల్ దేవ్ ఇంటర్నేషనల్ స్కూల్ సహా పలువురు ప్రముఖ విద్యాసంస్థలకు ఈ బెదిరింపులు వచ్చినట్లు వెల్లడైంది.

వివరాలు 

పేలుడు పదార్థాలు గానీ, అనుమానాస్పద వస్తువులు గానీ లభించలేదు 

పాఠశాలల ఆవరణలో పేలుడు పదార్థాలు ఉంచినట్లు మెయిల్స్‌లో పేర్కొనడంతో యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాయి. రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి పాఠశాలలకు చేరుకొని విద్యార్థులు, సిబ్బందిని బయటకు పంపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు గానీ, అనుమానాస్పద వస్తువులు గానీ లభించలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి బెదిరింపు మెయిల్స్ వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గుజరాత్‌'లో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..

Advertisement