Surat: బోర్డు పరీక్షలకు ముందు లగ్జరీ కార్లతో 12వ తరగతి విద్యార్థుల భారీ పరేడ్ .. VIDEO
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్‌లోని సూరత్‌లో ఓ పాఠశాలకు చెందిన 12వ తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షలకు ముందు ఫేర్‌వెల్ పార్టీ నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు దాదాపు 35 హై-ఎండ్ లగ్జరీ కార్లతో భారీ పరేడ్ నిర్వహించారు. బెంజ్, ఆడీ, బీఎమ్‌డబ్ల్యూ, పోర్చే,రేంజ్ రోవర్,స్కోడా,ఫార్చ్యూనర్,మహీంద్రా స్కార్పియో వంటి ఖరీదైన కార్లలో విద్యార్థులు ప్రయాణిస్తూ ఊరేగింపు చేపట్టారు.
విద్యార్థులంతా బ్లేజర్స్ ధరించి,సన్‌రూఫ్ ద్వారా బయటకు వచ్చి డ్యాన్స్‌లు చేస్తూ,సెల్ఫీలు దిగుతూ ఈ వేడుకను సందడిగా మార్చారు.
ఈ పరిసరాలను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై నెటిజన్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.విద్యార్థుల తీరును ఖండిస్తూ,పోలీసులు జోక్యం చేసుకుని తల్లిదండ్రులు,విద్యార్థులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో ఇదే..
સુરતમાં આ તે કેવું ફેરવેલ…?, ધોરણ 12 ના વિદ્યાર્થીઓ નીકળ્યા લગઝરી કારના કાફલા સાથે…..#surat #suratcity #suratcitypolice #suratpolice #student #students #car #cars #trending #tranding #breakingnews #viralnews #newsupdate #viral #tras #vehicle #shandarrajkot pic.twitter.com/4alFHamuj1
— Shandar Rajkot (@ShandaRajkot) February 10, 2025