
Gujrat Blast: బాణసంచా గోడౌన్‌లో పేలుడు.. 13 మంది మృతి.. నలుగురికి గాయలు
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బనస్కంతా జిల్లాలోని ఒక బాణసంచా కర్మాగారంలో భీకరమైన పేలుడు సంభవించింది.
ఈ దుర్ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు, నలుగురు గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్న అవకాశముందని సమాచారం.
దీసా పారిశ్రామిక ప్రాంతంలోని ఒక బాణసంచా కర్మాగారంలో మంగళవారం ఉదయం ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పేలుడు ప్రభావంతో ఫ్యాక్టరీ పైకప్పు పూర్తిగా కూలిపోయింది. దీంతో కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా చిక్కుకుపోయారు.
వివరాలు
పరారీలో ఫ్యాక్టరీ యజమాని
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
గాయపడినవారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే, ఫ్యాక్టరీ యజమాని ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.