Page Loader
Operation Shield: పాకిస్తాన్ సరిహద్దుల్లో నేడు 'ఆపరేషన్ షీల్డ్' మాక్ డ్రిల్.. పాక్‌లో భయాందోళనలు
పాకిస్తాన్ సరిహద్దుల్లో నేడు 'ఆపరేషన్ షీల్డ్' మాక్ డ్రిల్.. పాక్‌లో భయాందోళనలు

Operation Shield: పాకిస్తాన్ సరిహద్దుల్లో నేడు 'ఆపరేషన్ షీల్డ్' మాక్ డ్రిల్.. పాక్‌లో భయాందోళనలు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 31, 2025
09:01 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మే 31, శనివారం నాడు మాక్ డ్రిల్ నిర్వహించనుంది. 'ఆపరేషన్ షీల్డ్' పేరుతో చేపడుతున్న ఈ డ్రిల్ కారణంగా పాకిస్తాన్‌లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. భారత్ తీసుకుంటున్న తాజా చర్యగా దీన్ని భావిస్తున్న పాకిస్తాన్ మీడియా, అక్కడి విశ్లేషకులు ఈ డ్రిల్‌ను అణు దాడికి ముందురూపంగా చిత్రీకరిస్తున్నారు. పాక్‌ సైన్యం మాజీ అధికారులు, పత్రికా ప్రముఖులు సైతం అణు యుద్ధ భయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మాక్ డ్రిల్ క్రమంలో శనివారం రాత్రి 8 గంటలకు సరిహద్దు రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. బ్లాక్‌అవుట్‌తో పాటు సైరన్లు మోగించనున్నారు. మొత్తం 15 నిమిషాల పాటు బ్లాక్అవుట్ కొనసాగుతుంది.

Details

అణుదాడిగా చిత్రీకరిస్తున్న పాక్ మీడియా

ఈ డ్రిల్ జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో నిర్వహించనున్నారు. ఇప్పటికే జమ్మూ డివిజన్, కాశ్మీర్ డివిజన్‌లో సన్నాహాలు పూర్తి చేశారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మే 31, శనివారం నాడు మాక్ డ్రిల్ నిర్వహించనుంది. 'ఆపరేషన్ షీల్డ్' పేరుతో చేపడుతున్న ఈ డ్రిల్ కారణంగా పాకిస్తాన్‌లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. భారత్ తీసుకుంటున్న తాజా చర్యగా దీన్ని భావిస్తున్న పాకిస్తాన్ మీడియా, అక్కడి విశ్లేషకులు ఈ డ్రిల్‌ను అణు దాడికి ముందురూపంగా చిత్రీకరిస్తున్నారు.

Details

రాత్రి 8 గంటలకు విద్యుత్ సరఫరా బంద్

పాక్‌ సైన్యం మాజీ అధికారులు, పత్రికా ప్రముఖులు సైతం అణు యుద్ధ భయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మాక్ డ్రిల్ క్రమంలో శనివారం రాత్రి 8 గంటలకు సరిహద్దు రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. బ్లాక్‌అవుట్‌తో పాటు సైరన్లు మోగించనున్నారు. మొత్తం 15 నిమిషాల పాటు బ్లాక్అవుట్ కొనసాగుతుంది. ఈ డ్రిల్ జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో నిర్వహించనున్నారు. ఇప్పటికే జమ్మూ డివిజన్, కాశ్మీర్ డివిజన్‌లో సన్నాహాలు పూర్తి చేశారు.