Garba dance: నవరాత్రి పండుగలో గర్భా, దాండియా ప్రాముఖ్యత.. ఎందుకు ఆడతారు తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
నవరాత్రి వేడుకలు అంటే కేవలం దుర్గా పూజ, ఉపవాసం, రావణ దహనం మాత్రమే కాదు. గర్భా, దాండియా వంటి ప్రత్యేక నృత్యాలు కూడా ఉండటం ఈ పండుగకు ప్రత్యేకతని ఇస్తుంది.
ఈ రెండు నృత్యాలు లేకుండా గుజరాత్‌లోని శరన్నవరాత్రి ఉత్సవాలు అసంపూర్ణంగా భావిస్తారు. గర్భా అనేది సంప్రదాయ గుజరాతీ జానపద నృత్యం.
ఈ నృత్యాన్ని ప్రధానంగా నవరాత్రుల సమయంలో ఆడతారు. ఇది దుర్గాదేవి తొమ్మిది అవతారాలకు శ్రద్ధగా అర్పించే నృత్య రూపం.
శక్తి దేవతకు అంకితం చేస్తూ చుట్టూ గుండ్రంగా నిలబడి దీపం లేదా శక్తి విగ్రహం చుట్టూ ఈ నృత్యం చేస్తారు. గర్భా అనే పదం 'గర్భం' లేదా 'చిన్న మట్టి దీపం' అని అర్థం.
Deatails
సంప్రదాయ దుస్తులతో నృత్యాలు
ఇది స్త్రీ శక్తిని, సంతానోత్పత్తి శక్తిని సూచిస్తుంది.నవరాత్రి సమయంలో ఈ నృత్యం చెడుపై మంచికి దుర్గాదేవి సాధించిన విజయాన్ని చెబుతారు.
అందులో భాగంగా జీవన-మరణ చక్రాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఈ నృత్యంలో, మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, శక్తి దేవత ఆశీర్వాదాలు కోరుకుంటూ నృత్యం చేస్తారు.
దాండియా కూడా నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్యమైన భాగంగా ఉంటుంది. ఇది దుర్గాదేవి, మహిషాసురుడి మధ్య యుద్ధానికి ప్రతీకగా ఆడే నృత్యం.
Details
కర్రలను దుర్గాదేవి ఖడ్గంగా భావిస్తారు
దాండియాలో ఉపయోగించే కర్రలను దుర్గాదేవి ఖడ్గంగా భావిస్తారు. ఇది చెడుపై మంచికి సాధించిన విజయానికి గుర్తుగా ఉంటుంది.
గర్బా, దాండియా ఒకే విధంగా కనిపించినా, ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది. గర్బా చేతులు, కాళ్లను సమన్వయంతో కదిలిస్తూ చేస్తారు. అయితే దాండియాలో చెక్క కర్రలను ఉపయోగిస్తారు.
గర్బాలో పాటలు దుర్గాదేవి, ఆమె అవతారాల చుట్టూ ఉంటే, దాండియాలో పాటలు కృష్ణుడి రాసలీలలపై ఆధారపడి ఉంటాయి.