Gujarat: ప్రేమికుడికి క్షమాపణ చెప్పి యువతి ఆత్మహత్య.. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా పాలన్‌పూర్‌లో ఘటన
ఓ యువతి తన ప్రేమికుడికి క్షమాపణ చెబుతూ ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా పాలన్‌పూర్‌లో చోటుచేసుకుంది. 27 ఏళ్ల రాధా ఠాకూర్ అనే యువతి బ్యూటీ పార్లర్ నడుపుతోంది. ఆమె చాలా రోజులుగా భర్త నుంచి విడిపోయి తన సోదరితో కలిసి జీవిస్తోంది. ఆదివారం రాత్రి ఇంటికి వచ్చి సోదరితో కలిసి భోజనం చేసిన తర్వాత నిద్రకు వెళ్లిన రాధా మరుసటి రోజు ఉదయానికి చనిపోయినట్టు గుర్తించారు. ఆమె ఫోన్‌ను పరిశీలించగా కొన్ని ఆడియో రికార్డులు బయటపడ్డాయి. ఆ రికార్డింగ్ ప్రకారం ఆమె ఓ వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. దీంతో రాధా సోదరి అల్కా పోలీసులకు ఫిర్యాదు చేయగా,కుటుంబ సభ్యులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు పెట్టారు.
ప్రియుడికి క్షమాపణ చెప్పిన ఆడియో
పోలీసులు విచారణలో రాధా తన ప్రియుడికి క్షమాపణ చెప్పిన ఆడియోను గుర్తించారు. ఆ ఆడియోలో రాధా అతనికి క్షమాపణ చెప్పడం, అలాగే అతడి ఫొటో కోరడం వినిపించింది. అయితే అతడు ఫొటో పంపించకపోవడంతో, "గంటలోగా పంపకపోతే ఏమవుతుందో చూడు" అంటూ హెచ్చరించినట్లు ఆ రికార్డింగ్‌లో వెల్లడైంది. అనంతరం రాధా మరో ఆడియో రికార్డ్ చేసి తన నిర్ణయాన్ని వివరించింది. ఆమె తన ప్రియుడిని ఉద్దేశించి, "నన్ను క్షమించు, నేను మీ అనుమతి లేకుండా తప్పు చేస్తున్నాను. బాధపడకండి, సంతోషంగా ఉండండి, వివాహం చేసుకోండి. నా మరణాన్ని ఆత్మహత్యగా భావించవద్దు. మీరు సంతోషంగా ఉంటేనే నా ఆత్మకు శాంతి లభిస్తుంది. పనిలో, జీవితంలో కలతకు గురై ఈ నిర్ణయం తీసుకున్నాను" అని పేర్కొంది.
చర్చనీయాంశంగా ఆత్మహత్యలు
ఈ ఘటనతో పాటు ఇటీవల బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ భార్య నికిత, ఆమె కుటుంబ సభ్యులు పెట్టిన తప్పుడు కేసులతో విసిగి 80 నిమిషాల వీడియో రికార్డ్, 24 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యలు, ఆత్మహత్యలపై తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో గుజరాత్‌లో రాధా ఘటన మరలా ఆత్మహత్యలపై చర్చనీయాంశంగా మారింది.