Terrorist: జైలులో ఉగ్రవాదిని చితకబాదిన ఖైదీలు.. గుజరాత్ లోని సబర్మతి జైలులో ఘటన
ఈ వార్తాకథనం ఏంటి
ఆముదం గింజల నుంచి అత్యంత ఘోరమైన విషం 'రైసిన్' తయారు చేసి అమాయకులపై దాడి చేయాలని ప్రణాళికలు వేసిన ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌పై జైలులో తీవ్రమైన దాడి జరిగినట్టు సమాచారం. రైసిన్ కుట్ర కేసులో అతన్ని ఏటీఎస్ అధికారులు అరెస్టు చేసి సబర్మతి జైలుకు పంపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు గుజరాత్‌లోని సబర్మతి జైలులో హై-సెక్యూరిటీ ఖైదు బ్యారక్‌లో ఉన్నాడు. అయితే ఇటీవల అతడిపై తోటి ఖైదీలు దాడి చేసినట్టు తెలుస్తోంది.
వివరాలు
సంఘటనపై విచారణ
ఈ ఘటనకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, అతన్ని ఘాటుగా దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం బయటకు వచ్చింది. ఈ సంఘటనపై విచారణను ఇప్పటికే జైలు అధికారులు ప్రారంభించారు. ఒకేసారి పలువురు ఖైదీలు దాడి చేయడంతో పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో జైలు సిబ్బంది వెంటనే జోక్యం చేసుకుని అహ్మద్ ప్రాణాలను కాపాడినట్లు తెలుస్తోంది. ఘటన నివేదిక అందిన వెంటనే గుజరాత్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం జైలుకు చేరుకుని దాడి ఎలా జరిగింది, ఏం కారణం అన్న దానిపై లోతుగా విచారణ ప్రారంభించింది.