NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Gujarat: గుజరాత్‌లో అరుదైన ఘటన.. ఒకే చెట్టుకు 12 రకాల మామిడి పండ్లు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Gujarat: గుజరాత్‌లో అరుదైన ఘటన.. ఒకే చెట్టుకు 12 రకాల మామిడి పండ్లు
    గుజరాత్‌లో అరుదైన ఘటన.. ఒకే చెట్టుకు 12 రకాల మామిడి పండ్లు

    Gujarat: గుజరాత్‌లో అరుదైన ఘటన.. ఒకే చెట్టుకు 12 రకాల మామిడి పండ్లు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 09, 2025
    12:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సాధారణంగా ఒక మామిడి చెట్టు ఒక్కటి లేదా రెండే రకాల మామిడి పండ్లను అందిస్తుంది.

    అయితే గుజరాత్ రాష్ట్రంలోని అమ్రేలీ జిల్లాలోని దిట్ల అనే గ్రామంలో ఉన్న ఓ మామిడి చెట్టు మాత్రం విచిత్రంగా 12 వేర్వేరు రకాల మామిడి పండ్లను కాస్తోంది.

    ఈ చెట్టుపై కాసే పండ్లన్నీ రంగు,రుచి,వాసన,పరిమాణం,బరువుల పరంగా పూర్తిగా భిన్నంగా ఉంటున్నాయి.

    50 గ్రాముల నుంచి 2 కిలోల బరువుతో ఉండే మామిడిపండ్లను ఈ చెట్టు ఇస్తోంది.

    ఈ విశేషమైన చెట్టు ఉకాభాయ్ అనే రైతు యాజమాన్యంలో ఉన్న మామిడి తోటలో ఉంది.

    ఏటా అన్ని కాలాలలోనూ డజను రకాల మామిడి పండ్లను అందించగలగడం ఈ చెట్టు ప్రత్యేకతగా నిలుస్తోంది.

    వివరాలు 

    అంటుకట్టే విధానం ఇలా ఉంటుంది... 

    ఉకాభాయ్ చాల రోజుల నుంచీ మామిడి సాగులోనే నిమగ్నమై ఉన్నారు. అంటుకట్టే పద్ధతి ద్వారా మేలురకం మామిడి వంగడాల తయారీకి ఆయన నిత్యం ప్రయోగాలు చేస్తుంటారు.

    అలా ఆయన చేసిన ప్రయోగాల ఫలితంగానే ఇప్పుడు ఈ 12 రకాల మామిడిపండ్లను ఒకే చెట్టు పైన పొందగలుగుతున్నారు.

    ముందుగా మంచి లక్షణాలు కలిగిన ఒక మామిడి మొక్కను ఎంపిక చేసి, దాని వేర్ల భాగాన్ని తొలగిస్తారు.

    తదుపరి మరో నాణ్యమైన మామిడి మొక్కను తీసుకొని, దాని కాండం ఎగువభాగాన్ని సగానికి పైగా కత్తిరించి తీసివేస్తారు.

    ఈ రెండవ మొక్కకు వేర్లు ఉండడం వల్ల దానినే నేలలో నాటాలి. ఆ తరువాత, ఈ మొక్క కాండంపై మునుపటి మొక్క కాండాన్ని అతికించి బలంగా కట్టాలి.

    వివరాలు 

    మామిడి వంగడాల అభివృద్ధికి ప్రయోగాలను కొనసాగిస్తా: ఉకాభాయ్

    ఇలా చేయడం వల్ల ఒక్క మామిడి చెట్టుపైనే పలు రకాల వంగడాలు పండే అవకాశం ఉంటుంది.

    ఈ విధంగా తన తోటలో 12 రకాల పండ్లను కాస్తున్న చెట్టును చూసి ఉకాభాయ్ ఎంతో ఆనందపడుతున్నారు.

    మామిడి వంగడాల అభివృద్ధికి తన ప్రయోగాలను ఇలాగే కొనసాగిస్తానని ఆయన 'ప్రముఖ మీడియా'తో చెప్పారు.

    ఇలాంటి చెట్లు విస్తృతంగా రైతులకు అందుబాటులోకి వస్తే, అది వ్యవసాయ రంగానికి ఎంతో లాభదాయకంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుజరాత్

    తాజా

    Gujarat: గుజరాత్‌లో అరుదైన ఘటన.. ఒకే చెట్టుకు 12 రకాల మామిడి పండ్లు గుజరాత్
    Andhra News: రాష్ట్రప్రభుత్వ సహకారంతో ఏపీలో 25 జిల్లాల్లో క్రికెట్‌ మైదానాలు: ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్‌ ఆంధ్రప్రదేశ్
    Maruti Suzuki Wagon R : రూ.10 లక్షల లోపే టాప్‌ ఎండ్‌ వేరియంట్‌.. వాగన్‌ ఆర్‌ ధరలు ఇవే! మారుతి సుజుకీ
    TG News: 18 జిల్లాల్లో పెరిగిన భూగర్భ జలమట్టం.. గతేడాది మే నెలతో పోల్చితే 0.30 మీటర్లు పైకి  తెలంగాణ

    గుజరాత్

    IMD Alert: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ రాష్ట్రాలకు హెచ్చరీకలు జారీ భారత వాతావరణ శాఖ
    Gujarat Rains: గుజరాత్‌లో భారీ వర్షాలు.. 'రెడ్ అలర్ట్' ప్రకటించిన వాతావరణ శాఖ భారీ వర్షాలు
    Gujarat: గుజరాత్‌లో భారీ వర్షాల కారణంగా 15 మంది మృతి.. పలు రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్  భారతదేశం
    Gujarat Flood: గుజరాత్‌లో వరదలు.. 26 మంది మృతి, 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025