Food Market Survey: దేశవ్యాప్తంగా రద్దీ మార్కెట్లు లక్ష్యం: ఏటీఎస్ వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్‌లో పెద్దస్థాయి ఉగ్ర ప్రణాళికను అమలు చేసే ప్రయత్నంలో ఉన్న సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్‌ని,అతడితో పాటు మరో ఇద్దరు ఐసిస్ అనుదిన సానుభూతిపరులను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మొహియుద్దీన్ తన ఇంటినే ప్రయోగశాలలా మార్చి, ఆముదం గింజలను ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలే వ్యర్థ పదార్థం నుంచి రైసిన్ అనే ప్రమాదకరమైన విష రసాయనాన్ని తయారు చేసినట్టు అధికారులు వెల్లడించారు. అంతేకాదు,రద్దీగా ఉండే ఫుడ్ మార్కెట్లను స్వయంగా పరిశీలించినట్లు కూడా సమాచారం. ఈ జాబితాలో దిల్లీలోని ఆజాద్‌పుర్ మండీ,అహ్మదాబాద్‌లోని నరోడా ఫ్రూట్ మార్కెట్,లఖ్‌నవూలోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా జనసంచారం ఉండటం,రోజూ విస్తృత ప్రజా కార్యకలాపాలు జరుగుతుండటంతోనే వీటిని లక్ష్యంగా ఎంచుకున్నట్లు అంచనా.
వివరాలు
రైసిన్‌ను విషాయుధంగా ఎలా వాడాలనే విషయంపై అధ్యయనం
నిందితులు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహెల్ సలీంఖాన్‌లుగా గుజరాత్ ఏటీసీ పేర్కొంది . వీరిలో మొహియుద్దీన్ సయ్యద్ (35) దీనికి ప్రధాన నాయకుడు, సూత్రధారి అని స్పష్టం చేసింది. అతడు ఉగ్రదాడులలో రైసిన్‌ను విషాయుధంగా ఎలా వాడాలనే విషయాన్ని అధ్యయనం చేసినట్లు కూడా విచారణలో బయటపడింది. రైసిన్ విష ప్రభావం చాలా అరుదుగా కనిపిస్తుందని, సాధారణంగా ఈ విత్తనాలను మోతాదుగా తీసుకున్నప్పుడు మాత్రమే ప్రాణాలకు ప్రమాదం సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
తీవ్రవాద భావజాలం బలంగా ఉంది: గుజరాత్ ఏటీఎస్
అయితే సమయానికి చికిత్స లభిస్తే ప్రాణ నష్టం జరగకపోవచ్చని కూడా వైద్య నిపుణుల అభిప్రాయం. ''మొహియుద్దీన్ మంచి చదువుకున్న వ్యక్తే అయినా, అతనికి తీవ్రవాద భావజాలం బలంగా ఉంది. భారీ స్థాయిలో ఉగ్రదాడి జరపాలన్న ఆలోచనతో నిధుల సేకరణ, సభ్యుల నియామకం వంటి ఏర్పాట్లు కూడా చూస్తున్నాడు'' అని గుజరాత్ ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి మీడియాతో చెప్పారు.