Page Loader
Bomb threat: గుజరాత్లోని ఓ ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపులు.. రంగంలోకి సైబర్ టీమ్..
గుజరాత్లోని ఓ ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపులు.. రంగంలోకి సైబర్ టీమ్..

Bomb threat: గుజరాత్లోని ఓ ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపులు.. రంగంలోకి సైబర్ టీమ్..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 24, 2025
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు ఈ రోజు (జనవరి 24) తెల్లవారుజామున 4 గంటలకు క్యాంపస్‌ను పేల్చివేస్తామని బెదిరింపు ఇ-మెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆ బెదిరింపును అందుకున్న పాఠశాల అధికారులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రతను పరిగణనలోకి తీసుకుంటూ ఈ రోజు పాఠశాలకి సెలవు ప్రకటించారు. ఈ బాంబు బెదిరింపులపై బాంబు స్క్వాడ్, పోలీసులు ప్రతి చోట క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారని తెలుస్తోంది.

వివరాలు 

పాఠశాల భవనాన్ని పూర్తిగా శానిటైజ్

పాఠశాల భవనాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు. మరోవైపు, ఈ ఇ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు సైబర్ సెల్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా, వడోదరలోని సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, ఈ సంఘటనలకు సంబంధించి ఎటువంటి విశ్వసనీయమైన బెదిరింపులు లేవని ధృవీకరించారు. అయితే, ప్రజల భద్రత కోసం వారు నిరంతరం అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. అలాగే, గతంలో ఢిల్లీలో కూడా ఇలాంటి బాంబు బెదిరింపులు పాఠశాలలకు వచ్చినట్టు గుర్తుచేశారు. ఈ బెదిరింపులను వారు తేలిగ్గా తీసుకోలేదని పేర్కొన్నారు.