Gujarat: గుజరాత్‌లో భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య.. వీడియోలో సంచలన విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
భార్యల వేధింపులు భర్తల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి.
బెంగళూరులో టెక్కీ అతుల్ సుభాష్, దిల్లీ కేఫ్ ఓనర్ పునీత్ ఖురానా వంటి ఘటనలు ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనాలను సృష్టించాయి.
వీరిద్దరూ భార్యల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు వీడియో రికార్డ్ చేసి మరణించారు. తాజాగా గుజరాత్‌లో ఇలాంటి మరొక ఘటన చోటుచేసుకుంది.
గుజరాత్ బొటాడ్ జిల్లాలోని జమ్రాలా గ్రామంలో 39 ఏళ్ల సురేష్ సతాదియా డిసెంబర్ 30న తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Details
తన భార్యకు గుణపాఠం చెప్పాలి
మరణానికి ముందు అతను మొబైల్ ఫోన్‌లో వీడియో రికార్డ్ చేసి, తన భార్యకు గుణపాఠం చెప్పాలని కోరాడు.
ఆమె తన మరణానికి కారణమని తెలిపాడు. సతాదియా తండ్రి ఫిర్యాదుతో బాధితుడి భార్య జయబెన్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఆయన తెలిపిన ప్రకారం, సతాదియా తరచూ తన భార్యని తీసుకురావడానికి అత్తమామల ఇంటికి వెళ్లేవారని, కానీ ఆమె నిరాకరించేదని చెప్పారు.
ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత 108 సెక్షన్ (ఆత్మహత్యకు ప్రేరేపణ) కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.