Page Loader
HMPV: గుజరాత్‌లో రెండు సంవత్సరాల బాలుడికి హెచ్ఎంపీవీ.. ధ్రువీకరించిన డాక్టర్లు
గుజరాత్‌లో రెండు సంవత్సరాల బాలుడికి హెచ్ఎంపీవీ.. ధ్రువీకరించిన డాక్టర్లు

HMPV: గుజరాత్‌లో రెండు సంవత్సరాల బాలుడికి హెచ్ఎంపీవీ.. ధ్రువీకరించిన డాక్టర్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 06, 2025
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలో రెండు హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్) కేసులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధ్రువీకరించిన కొద్దిగంటల్లోనే గుజరాత్‌లో మరో కేసు వెలుగు చూసింది. గుజరాత్‌లో రెండేళ్ల బాలుడు హెచ్ఎంపీవీ వైరస్‌ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అతనికి అహ్మదాబాద్‌లోని చంద్ ఖేడా ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ వైరస్ కేసులు వరుసగా నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.