Page Loader
Air India: ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ఒకే ఒక్క ప్రయాణికుడు
Air India: ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ఒకే ఒక్క ప్రయాణికుడు

Air India: ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ఒకే ఒక్క ప్రయాణికుడు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2025
07:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఒక ప్రయాణికుడు అద్భుతంగా ప్రాణాలతో బయటపడటం సంచలనంగా మారింది. ఈ ప్రమాద ఘటనలో రమేష్ విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు మృత్యుంజయుడిగా బయటపడినట్లు గుర్తించారు. ప్రమాదం జరిగిన క్షణాలకే సీటు నంబర్ 11ఏలో ప్రయాణిస్తున్న ఆ ప్రయాణికుడు ఎమర్జెన్సీ గేటు ద్వారా విమానం వెలుపలికి నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను విచారణ అనంతరం అహ్మదాబాద్ పోలీసులు వెల్లడించారు. విమానం కూలిన అనంతరం ఆయన ఎమర్జెన్సీ గేటు ద్వారా బయటకు వచ్చారని వారు తేల్చారు.

వివరాలు 

11ఏ సీటులో రమేష్ విశ్వాస్ కుమార్ 

ఈ ఘటనపై అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ స్పందిస్తూ - ''ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఓ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 11ఏ సీటులో ఉన్న అతని గుర్తింపు నమోదైంది'' అని తెలిపారు. అయితే, ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్యపై ఇంకా స్పష్టత లేదు. కానీ విమానం జనావాస ప్రాంతంలో కూలిన నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కమిషనర్ మాలిక్ పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రమాదం నుంచి బయటపడ్డ ఒకే ఒక్క ప్రయాణికుడు