LOADING...
Gujarat: కబడ్డీ మ్యాచ్ తర్వాత హాస్టల్‌లో దారుణం.. ఇంటర్ విద్యార్థిపై నలుగురు దాడి
కబడ్డీ మ్యాచ్ తర్వాత హాస్టల్‌లో దారుణం.. ఇంటర్ విద్యార్థిపై నలుగురు దాడి

Gujarat: కబడ్డీ మ్యాచ్ తర్వాత హాస్టల్‌లో దారుణం.. ఇంటర్ విద్యార్థిపై నలుగురు దాడి

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 09, 2025
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జూలై 26న జరిగిన కబడ్డీ మ్యాచ్ వివాదం తర్వాతి రోజున, నలుగురు తోటి విద్యార్థులు కలిసి 12వ తరగతి విద్యార్థిని హాస్టల్ గదిలో దారుణంగా కొట్టారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను మరొక విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీడియో వైరల్ అయ్యిందని పోలీసులు తెలిపారు, దాడికి పాల్పడినవారు హాస్టల్ విద్యార్థులు కాకుండా ఇతర వ్యక్తులు కూడా ఉన్నారు. భయంతో బాధిత విద్యార్థి హాస్టల్ అధికారులకు తాను అనారోగ్యంగా ఉన్నట్లు చెప్పి, తండ్రితో కలిసి ఇంటికి వెళ్లిపోయాడు.

Details

విద్యార్థులపై కేసు నమోదు

బాధితుడి తండ్రి విమల్ చోంచా మాట్లాడుతూ గత నెలలో నా కొడుకును కొంతమంది విద్యార్థులు హాస్టల్‌లో కొట్టారు. ఈ విషయం నాకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మాత్రమే తెలిసింది. పాఠశాల నిర్వాహకులు మాకు ఏ సమాచారం ఇవ్వలేదు. వారిని కలవడానికి ప్రయత్నించాను, కానీ వారు కలవలేదు, ఫోన్ చేసినా ఎత్తలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు అధికారి హితేష్ ధంధాలియా మాట్లాడుతూ వీడియో ఆధారంగా నలుగురు విద్యార్థులపై జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాము. పాఠశాల నిర్వాహకుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన తర్వాత, విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పాఠశాలలు కఠిన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియో