LOADING...
Gujarat: 6 రోజుల్లో గుజరాత్ వారసత్వ ప్రదేశాలు: పూర్తి ట్రావెల్ గైడ్
6 రోజుల్లో గుజరాత్ వారసత్వ ప్రదేశాలు: పూర్తి ట్రావెల్ గైడ్

Gujarat: 6 రోజుల్లో గుజరాత్ వారసత్వ ప్రదేశాలు: పూర్తి ట్రావెల్ గైడ్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2026
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశ పశ్చిమ అంచున ఉన్న గుజరాత్ రాష్ట్రం... చరిత్ర, సంస్కృతి, వాస్తుశిల్ప సంపదతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రాచీన రాజవంశాల నుంచి ఆధునిక నిర్మాణాల వరకు ఎన్నో అద్భుత కట్టడాలు ఇక్కడ కనిపిస్తాయి. ఈ ఆరు రోజుల యాత్రలో గుజరాత్‌లోని ప్రసిద్ధ వారసత్వ ప్రదేశాలు, అంతగా తెలియని నిర్మాణ అద్భుతాలు - రెండింటినీ అనుభవించవచ్చు. ప్రతి రోజు ఒక కొత్త వాస్తు వైభవాన్ని మీ ముందుకు తీసుకువస్తుంది.

అహ్మదాబాద్

మొదటి రోజు: అహ్మదాబాద్ వారసత్వ సందర్శనం

మీ యాత్రను గుజరాత్‌లో అతిపెద్ద నగరమైన అహ్మదాబాద్'తోప్రారంభించండి. ఈ నగరంలో సంప్రదాయం, ఆధునికత కలిసిన అందం కనిపిస్తుంది. మొదటగా సబర్మతి ఆశ్రమంను సందర్శించండి. మహాత్మా గాంధీ జీవితం, స్వాతంత్ర్య ఉద్యమ చరిత్ర ఇక్కడ ప్రత్యక్షంగా తెలుస్తాయి. తర్వాత సిది సయ్యద్ మసీదుకు వెళ్లండి. రాతిపై చెక్కిన జాలి పనితనం ఈ మసీదును ప్రత్యేకంగా నిలబెట్టింది. అలాగే అదలాజ్ స్టెప్‌వెల్ను తప్పక చూడాలి. శిల్పకళ, ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది అద్భుత నిదర్శనం.

పఠాన్

రెండో రోజు: పఠాన్‌లో రాణి కీ వావ్ మహిమాన్వితం

రెండో రోజు పఠాన్ కు ప్రయాణించండి. ఇక్కడి రాణి కీ వావ్ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందింది. 11వ శతాబ్దంలో రాణి ఉదయమతి తన భర్త భీమ్‌దేవ్ రాజు జ్ఞాపకార్థం నిర్మించిన ఈ మెట్ల బావి, అద్భుత శిల్పాలతో అలరారుతుంది. ప్రతి మెట్టులోనూ గుజరాత్ వాస్తుశిల్ప ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది.

Advertisement

వడోదరా

మూడో రోజు: వడోదరాలో లక్ష్మీ విలాస్ ప్యాలెస్

మూడో రోజు వడోదరాచేరుకోండి. అక్కడి లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ను సందర్శించండి. మరాఠా రాజవంశ నివాసంగా ఉన్న ఈ భవనం, బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు విస్తీర్ణంలో ఉంది. ఇండో-సారసెనిక్ వాస్తుశైలి, వెనీషియన్ షాండిలియర్లు, మొజాయిక్ ఫ్లోర్లు - ప్రతి భాగం రాజసంగా ఉంటుంది. ఇక్కడ తిరిగితే రాజుల జీవన విధానం ఎలా ఉండేదో తెలుస్తుంది, అద్భుతమైన చేతిపనితనాన్ని ఆస్వాదించవచ్చు.

Advertisement

మోధేరా

నాలుగో రోజు: మోధేరా సూర్యదేవాలయం వైభవం

నాల్గో రోజు మోధేరాకు వెళ్లండి. అక్కడి సూర్యాలయం, మోధేరా సూర్యదేవునికి అంకితం చేయబడింది. 1026లో భీమ్‌దేవ్ రాజు పాలనలో నిర్మించిన ఈ దేవాలయం, శిల్పకళలో అగ్రగణ్యంగా నిలిచింది. పురాణ గాథలు, ఖగోళ చిహ్నాలు గోడలపై అందంగా చెక్కారు. గుడి చుట్టూ పచ్చని తోటలు ఉన్నాయి. ప్రకృతి అందాల మధ్య ప్రశాంతంగా గడపడానికి, కాసేపు విశ్రాంతి తీసుకోడానికి ఇది మంచి ప్రదేశం.

జునాగఢ్

ఐదో రోజు: జునాగఢ్‌లో ఉపర్‌కోట్ కోట

ఐదో రోజు జునాగఢ్‌కు వెళ్ళండి. అక్కడి ఉపర్‌కోట్ కోటను పరిశీలించండి. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ కోటకు భారీ గోడలు, బురుజులు ప్రత్యేక ఆకర్షణ. సమీపంలో ఉన్న బాబా ప్యారే పురాతన గుహలు కూడా సందర్శించవచ్చు. ఇవి వందల సంవత్సరాల క్రితం నాటివి. స్థానిక చరిత్ర గురించి మరింత తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి.

భుజ్

ఆరో రోజు: భుజ్‌లో ఐనా మహల్ ప్యాలెస్

చివరి రోజు భుజ్‌ చేరుకుని ఐనా మహల్ ప్యాలెస్ ను సందర్శించండి. 18వ శతాబ్దంలో రావ్ లఖ్‌పత్‌జీ నిర్మించిన ఈ ప్యాలెస్ అద్దాల అలంకరణలకు ప్రసిద్ధి. గాజు, అద్దపు పనితనం స్థానిక కళాకారుల నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. గుజరాత్ కట్టడాల యాత్రకు ఇది ఒక సంతృప్తికర ముగింపు అవుతుంది.

Advertisement